Share News

Cheannai: మహిళ ఇంట్లో స్పై కెమెరా అమర్చిన డెంటల్ స్టూడెంట్.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:01 PM

చెన్నైలో డెంటల్ విద్యార్థి తన వక్రబుద్దిని చూపించాడు. తమ ఇంటిలో కిరాయికి ఉండే వారి బెడ్ రూమ్‌లో స్పె కెమెరా అమర్చాడు. ఆ ఇంట్లో ఉండే మహిళ బట్టలు మార్చుకునే వీడియోలను రికార్డ్ చేశాడు.

 Cheannai: మహిళ ఇంట్లో స్పై కెమెరా అమర్చిన డెంటల్ స్టూడెంట్.. ఏం జరిగిందంటే..?

చెన్నై: డెంటల్ విద్యార్థి తన వక్రబుద్దిని చూపించాడు. తమ ఇంటిలో కిరాయికి ఉండే వారి బెడ్ రూమ్‌లో స్పై కెమెరా (Spy Camera) అమర్చాడు. ఆ ఇంట్లో ఉండే మహిళకు అనుమానం వచ్చింది. ఆ కెమెరా గురించి భర్తను ఆరా తీసింది. అది రికార్డర్ అని భార్యతో చెప్పాడు. అందులో ఉన్న వీడియో ఫుటేజీ చూసి ఇద్దరు షాకయ్యారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా రికార్డ్ చేసింది ఎవరో తెలిసింది.

చెన్నైలో గల ఇంటిలో ఆ దంపతులు గత కొన్నేళ్లుగా ఉంటున్నారు. ఇటీవల తన గదిలో పెన్నును మహిళ గమనించింది. పెన్ను ఎరుపు రంగులో మెరుస్తుండడాన్ని చూసింది. ఇంటికి వచ్చిన తర్వాత భర్తను ఆ పెన్ను గురించి ఆరా తీసింది. తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. దానిని పరిశీలించి రికార్డింగ్ పరికరం అని భార్యకు వివరించాడు. ఆ పెన్ స్పై కెమెరా అని తర్వాత గుర్తించారు. అందులో రికార్డయిన ఫుటేజీ చూసి ఖంగుతిన్నారు. మహిళ బట్టలు మార్చుకున్న వీడియోలు కనిపించాయి. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఇంటి యజమాని కుమారుడు ఈ పని చేశాడని గుర్తించారు. మహిళ గదిలో అతనే పెన్ లాంటి స్పై కెమెరా ఉంచాడని వివరించారు. ఇంటి ఓనర్ కుమారుడు, డెంటల్ స్టూడెంట్ ఇబ్రహీంను అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 02:01 PM