Share News

Lok Sabha Elections 2024: బీజేపీ తొలి విజయం.. అక్కడ బోణీ కొట్టిన కాషాయ పార్టీ

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:32 AM

లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. దేశంలో ఓ నియోజకవర్గంలో బీజేపీ బోణీ కొట్టింది. మీకు తెలుసా. నెల రోజుల క్రితమే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ ఆసక్తికర ఘటన గుజరాత్‌లో జరిగింది.

Lok Sabha Elections 2024: బీజేపీ తొలి విజయం.. అక్కడ బోణీ కొట్టిన కాషాయ పార్టీ

గాంధీనగర్: లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. దేశంలో ఓ నియోజకవర్గంలో బీజేపీ బోణీ కొట్టింది. మీకు తెలుసా. నెల రోజుల క్రితమే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ ఆసక్తికర ఘటన గుజరాత్‌లో జరిగింది. బీజేపీ (BJP) అభ్యర్థి ముకేష్ దలాల్ (Mukesh Dalal) సూరత్ స్థానం నుంచి కౌంటింగ్‌కి ముందే ఏకపక్షంగా గెలిచారు.

దీంతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) బీజేపీ ఖాతా తెరిచినట్టయ్యింది. అసలు కౌంటింగ్‌కి ముందే ఇదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా..! కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడటంతో పాటు ఇతర అభ్యర్థులు తమ నామినేషన్‌ని వెనక్కు తీసుకోవడం వల్లే.. ముకేష్ దలాల్‌ని విన్నర్‌గా ప్రకటించడం జరిగింది.


కాంగ్రెస్ పార్టీ తరఫున సూరత్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నీలేష్ కుంభానీ తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని ముగ్గురు ప్రతిపాదకులు ఎన్నికల అధికారికి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తద్వారా నీలేష్ నామినేషన్‌ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో.. గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌తో పాటు ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఈ వివాదం తలెత్తింది. అటు.. కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థి సురేష్ పద్సాలాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 07:33 AM