Share News

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

ABN , Publish Date - Feb 23 , 2024 | 05:42 PM

బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

పాట్నా: బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల (Bihar MLC Elctions) నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ (Election Commission) శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం. మరో రెండు నెలల్లో ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. మే 6వ తేదీతో పదవీకాలం ముగియనున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి (ఆర్జేడీ), ఆ పార్టీ నేత రామ్ చంద్ర పూర్వే కూడా ఉన్నారు.


తాజా షెడ్యూల్ ప్రకారం 11 సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 4న వెలువడనుంది. మార్చి 11వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. మార్చి 14 వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 21న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు సాయంత్రమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మార్చి 23వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సి ఉన్న 11 స్థానాల్లో 3 సీట్లకు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. కాంగ్రెస్ ఒక సీటుకు ప్రాతినిధి వహిస్తోంది. జేడీయూకు సింహభాగం ఉంది. నితీష్ కుమార్‌తో పాటు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సంజయ్ కుమార్ ఝా పదవీకాలం కూడా ముగియనుంది. జేడీయూ ఎమ్మెల్యేలు ఖలీద్ అన్వర్, రామేశ్వర్ మెహతో పాటు హెచ్ఏఎం వ్యవస్థాపకుడు జితిన్ రమ్ మాంఠీ తనయుడైన సంతోష్ సుమన్ పదవీకాలం కూడా ముగియనుంది.

Updated Date - Feb 23 , 2024 | 05:42 PM