Share News

Delhi's Water Crisis: హరియాణ సీఎంకు ఢిల్లీ ఎల్జీ ఫోన్

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:37 PM

దేశ రాజధాని న్యూడిల్లీకి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరియాణ సిఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు. ఈ మేరకు న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Delhi's Water Crisis: హరియాణ సీఎంకు ఢిల్లీ ఎల్జీ ఫోన్

న్యూఢిల్లీ, జూన్ 11: దేశ రాజధాని న్యూడిల్లీకి మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరియాణ సిఎం నయాబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారు. ఈ మేరకు న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వేసవి కారణంగా న్యూఢిల్లీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో నీటి కేటాయింపుల్లో భాగంగా న్యూఢిల్లీకి రావాల్సిన మంచి నీటిని సరఫరా చేయాలని హరియాణ సీఎంకు సోమవారం తాను స్వయంగా పోన్ చేసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని న్యూఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా పేర్కొన్నారు.

Also Read: Loksabha Election Result: మంత్రి పదవికి జితిన్ ప్రసాద రాజీనామా.. ఎందుకంటే..


ఢిల్లీలో మంచి నీటి ఇక్కట్లపై సోమవారం ఆమ్ ఆద్మీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌.. తనను కలిశారని చెప్పారు. నీటి సంక్షోభంపై హరియాణా ప్రభుత్వంతో తాను చర్చిస్తానని ఈ సందర్బంగా వారికి హామీ ఇచ్చానన్నారు. మరోవైపు న్యూఢిల్లీలో మంచి నీటి సరఫరా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆప్ మంత్రులకు ఈ సందర్భంగా సూచించానని ఎల్జీ వెల్లడించారు. ఆ క్రమంలో సోమవారం హరియాణ సీఎంకు ఎల్జీ స్వయంగా ఫోన్ చేసి.. ఢిల్లీకి మంచి నీటి సరఫరాపై మాట్లాడారు.

Also Read: Odisha: సీఎం ప్రమాణ స్వీకారం.. రేపు మధ్యాహ్నం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు


మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రం హరియాణ. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఢిల్లీలో మంచి నీటి కొరత సృష్టించేందుకు కుట్రకు తెర తీసిందంటూ ఆప్ మంత్రులు సార్వత్రిక ఎన్నికల వేళ ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో హరియాణ మంచి నీటిని సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వాలంటూ.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించిన విషయం విధితమే.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 05:33 PM