Share News

Bihar Politics: అసెంబ్లీలో బలపరీక్ష వేళ.. కనిపించకుండా పోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:25 PM

బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్‌బంధన్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.

Bihar Politics: అసెంబ్లీలో బలపరీక్ష వేళ.. కనిపించకుండా పోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు

పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్‌బంధన్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతోనే అధికార జేడీయూ - బీజేపీ కూటమి రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న నితీశ్ అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలి.

అయితే ఫ్లోర్ టెస్ట్‌కు రెండ్రోజుల ముందే 12 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేల జాడ కనిపించకుండా పోయింది. వారి సమాచారం అందకపోవడంతో ఆర్జేడీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బిహార్ అసెంబ్లీ JDU-BJP కూటమికి ఇప్పటికే మెజారిటీ ఉంది. 127 మెజారిటీ మార్క్‌కాగా జేడీయూకి 43, బీజేపీకి 74 సీట్లున్నాయి. అయితే 79 మంది ఎమ్మెల్యేలను కలిగిన ఆర్జేడీలో 12 మంది కనిపించకుండా పోవడంతో పార్టీలో ఏదైనా తిరుగుబాటు వస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి.


తిరుగుబాటు వస్తే తేజస్వీ ప్రతిష్ఠ మరింత దిగజారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ - జేడీయూ కూటమికి మెజారిటీ మార్క్ కంటే 5 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉన్నా.. ఇతర పార్టీల్లోంచి కొందరిని తీసుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని నితీష్ కుమార్ జనవరి 28న సీఎంగా తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కనిపించకుండా పోయిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు నితీశ్‌కు మద్దతు ఇస్తే అధికార కూటమికి 139 మంది మద్దతు ఉంటుంది. తద్వారా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని అధికార కూటమి భావిస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 10 , 2024 | 12:30 PM