Share News

Kangana Ranaut : ఎన్నికల ప్రచారం ముందు సినిమా షూటింగ్‌లు ఓ జోక్‌

ABN , Publish Date - May 19 , 2024 | 05:38 AM

ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.

 Kangana Ranaut : ఎన్నికల ప్రచారం ముందు  సినిమా షూటింగ్‌లు ఓ జోక్‌

న్యూఢిల్లీ, మే 18: ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.

‘‘ఆరు బహిరంగ సభలు..పలుమార్లు కార్యకర్తలతో భేటీలు, వారికి పలకరింపులు..ఒకే రోజు ఏకధాటిగా 450 కి.మీ. ప్రయాణం.. భోజనం ఎప్పుడు చేస్తున్నానో...స్నాక్స్‌ ఎప్పుడు తింటున్నానో... కారులో తిరుగుతునే ఉన్నా...ఈ హడావిడి ముందు సినిమాలు తీయడానికి చేసే సినీ పోరాటం ఓ జోక్‌లా అనిపిస్తోంది. ఉఫ్‌్‌ఫ..’’అంటూ వ్యాఖ్యానించారు.

Updated Date - May 19 , 2024 | 05:53 AM