Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ ఒరిజినలేనా? ఇలా చేక్ చేయండి..!
ABN , Publish Date - Aug 08 , 2024 | 10:09 PM
Aadhaar Card: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ఏ ప్రభుత్వ పథకానికైనా.. ఏ రిజిస్ట్రేషన్‌కైనా.. ఈ డాక్యూమెంటేషన్‌కైనా ఈ ఆధార్ కార్డ్ తప్పనిసరి. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఆధార్ ఉంటుంది. దీనిని యూనిట్ ఐడెంటిటి కార్డ్ అంటారు.
Aadhaar Card: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ఏ ప్రభుత్వ పథకానికైనా.. ఏ రిజిస్ట్రేషన్‌కైనా.. ఈ డాక్యూమెంటేషన్‌కైనా ఈ ఆధార్ కార్డ్ తప్పనిసరి. భారతదేశంలోని ప్రతి పౌరుడికి తప్పనిసరిగా ఆధార్ ఉంటుంది. దీనిని యూనిట్ ఐడెంటిటి కార్డ్ అంటారు. 12 ప్రత్యేక అంకెలతో కూడిన ఈ ఆధార్ కార్డును UIDAI జారీ చేస్తుంది. ఆధార్ కార్డును ప్రవేశపెట్టిన తరువాత దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కార్డు సహాయంతో అనేక ప్రభుత్వ పథకాల నిధులను ఎలాంటి అంతరాయం లేకుండా, నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే వేసేస్తున్నారు.
పాఠశాలల్లో పిల్లలను చేర్చుకోవడం నుంచి బ్యాంకులో అకౌంట్ తెరిచే వరకు దాదాపు అన్ని చోట్లా ఆధార్ కార్డు అవసరమవుతుంది. భారతదేశ ప్రజల బయోమెట్రిక్ వివరాలన్నీ ఆధార్ కార్డులో నిక్షిప్తమయ్యాయి. 12 అంకెల ఆధార్ నెంబర్ కొడితే.. ఆ వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో వస్తుంది. ఈ ఆధార్ కార్డుతో ప్రయోజనాలు ఉన్నట్లే.. మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆధార్‌తో మోసాలు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఫేక్ ఆధార్ కార్డ్స్ సృష్టించి.. అమాయక ప్రజలను, ప్రభుత్వాలను సైతం మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. అందుకే ఎవరైనా ఆధార్ కావాలంటే UIDAI అధికారం కేంద్రంలోనే తీసుకోవాలని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. లేదంటే మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డ్ తయారు చేసి ఇచ్చేస్తారని, ఇలాంటి నకిలీ ఆధార్ కార్డ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
మరి మీ వద్ద ఉన్న ఆధార్ కార్డు నిజమైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి? మరేం పర్వాలేదు. మీకోసమే ఈ ప్రత్యేక కథనం. ఇందులో నకిలీ ఆధార్ కార్డ్, ఒరిజిన్ ఆధార్ కార్డ్‌ను ఎలా గుర్తించాలో సవివరింగా పేర్కొనడం జరిగింది. దీని ఆధారంగా మీ ఆధార్ కార్డ్ ప్రామాణికతను చెక్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ ఒరిజినలేనా? ఇలా చెక్ చేయండి..
1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/check-aadhaar-validity ని సందర్శించాలి. దీని తర్వాత స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
2. ఇక్కడ మీరు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
3. 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత ప్రొసీడ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
5. మీ ఆధార్ కార్డ్ UIDAI ద్వారా ధృవీకరించబడిన తరువాత ఇది పని చేస్తుందని స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.