Share News

Ayodhya: వెయ్యి మంది భక్తులకు ఫ్రీగా శ్రీరామ్ టాటూస్.. భక్తి చాటుకుంటున్న ఆర్టిస్ట్..

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:49 PM

ఎన్నో వివాదాలు, పోరాటాల తర్వాత సాధించుకున్న అయోధ్య రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Ayodhya: వెయ్యి మంది భక్తులకు ఫ్రీగా శ్రీరామ్ టాటూస్.. భక్తి చాటుకుంటున్న ఆర్టిస్ట్..

ఎన్నో వివాదాలు, పోరాటాల తర్వాత సాధించుకున్న అయోధ్య రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ మేరకు కొంతమంది భక్తులు తమ సాయంగా ఉడతాభక్తిని ప్రదర్శించుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన రాజేంద్ర అనే యువకుడు 1,001 మంది ఉచితంగా రామనామాలను టాటూగా వేయాలని నిర్ణయించుకున్నాడు. టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేసే రాజేంద్ర.. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఉచితంగా శ్రీరామ్ నామాన్ని టాటూగా వేస్తున్నాడు. రాముడి చిత్రాలను అందంగా చేతులు, ఛాతి, భుజాలపై డిజైన్‌ చేస్తున్నాడు. ఈ ఆఫర్ కు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పచ్చబొట్టు వేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ఏం పర్లేదు అన్నట్లు వెయిట్ చేసి మరీ టాటూ వేయించుకుని భక్తిని చాటుకుంటున్నారు.

రాజేంద్రకు శ్రీరాముడంటే ఎంతో భక్తి. ఏటా శ్రీరామనవమికి ఏదో కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని వినూత్నంగా టాటూలు వేయాలని అనుకున్నాడు. ముందు 101 మందికి ఉచితంగా పచ్చబొట్లను వేయాలని నిర్ణయించుకోగా.. ఆ తర్వాత మంచి స్పందన రావడంతో ఆ సంఖ్యను 1,001కు పెంచాడు. ఇప్పటివరకు సుమారు 350 మందికి టాటూలు వేసినట్లు రాజేంద్ర తెలిపాడు. జనవరి 22 వరకు తన లక్ష్యాన్ని పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

మరోవైపు.. అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ అడుగడుగునా నెలకొంది. జనవరి 22 మధ్యాహ్నం 12గంటల 20 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 01:49 PM