Share News

Farmers Protest: రైతులను వెళ్లిపొమ్మని చెప్పండి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:47 PM

తమ సమస్యలను పరిష్కరించాలంటూ దేశ రాజధాని సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు.

Farmers Protest: రైతులను వెళ్లిపొమ్మని చెప్పండి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..

తమ సమస్యలను పరిష్కరించాలంటూ దేశ రాజధాని సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు. తక్షణమే సరిహద్దు వదిలి వెళ్లిపోవాలంటూ పలు మార్లు పోలీసులూ లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వారు చెక్కు చెదరలేదు. అణచివేయాలని చూస్తే మరింత ఉద్యమిస్తామని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం వారి ఆందోళనను ఆపే ప్రయత్నంలో మరో ఘటన జరిగింది. వెంటనే రైతులను బార్డర్స్ నుంచి వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. డాక్టర్ నంద్ కిషోర్ గార్గ్ ఈ వ్యాఖ్యాన్ని దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌లో రైతుల ఉద్యమం కారణంగా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దేశ రాజధాని చుట్టుపక్కల సరిహద్దులను కలుపుతూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ హైవేలపై రైతులు నిరసనలు చేస్తున్నారు. దిల్లీలోని సామాన్య ప్రజలు తమ తమ కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జీవనోపాధి, వైద్య సేవలపై ప్రభావం పడుతోందన్నారు. కొన్ని చోట్లు విద్యా కార్యకలాపాలు సైతం నిలిచిపోతున్నాయని పిటిషన్ లో తెలిపారు. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉందని వివరించారు.


కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ట్రాక్టర్లతో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నందున, హైవేలపై అక్రమంగా ప్రవేశించే ట్రాక్టర్లపై పూర్తి నిషేధం విధించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఓ చట్టాన్ని రూపొందించి పాటించేలా చూడాలని ఆదేశించాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 03:47 PM