Share News

Crime: మైనర్ పై అత్యాచారం ఆరోపణలు.. మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు..

ABN , Publish Date - Mar 15 , 2024 | 03:28 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

Crime: మైనర్ పై అత్యాచారం ఆరోపణలు.. మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. 81 ఏళ్ల యడ్యూరప్ప తన కుమార్తెపై అత్యాచారం చేశారని, తమకు న్యాయం చేయాలని, పూర్తి విచారణ కోరుతూ సిట్ ను ఏర్పాటు చేయాలంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగిన తరువాత యడ్యూరప్ప క్షమాపణలు చెప్పారని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి కంప్లైంట్ తో అధికారులు యడ్యూరప్పపై కేసు పెట్టారు.

బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 8 (లైంగిక వేధింపులకు పాల్పడటం), ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 (ఎ) (లైంగిక వేధింపు) కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై మాజీ సీఎం స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తన కూతురిని తీసుకుని తన వద్దకు వచ్చారని చెప్పారు. వారు సమస్యను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. దీంతో తాను ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్ ఫోన్‌ చేసినట్లు తెలిపారు. ఇంత జరిగినా వారు తనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదని యడ్యూరప్ప అన్నారు. వారి ఇబ్బందులు చూడలేక కొంత డబ్బు కూడా ఇచ్చినట్లు వివరించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 03:30 PM