Share News

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:37 PM

బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

పట్నా: బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా.. పలువురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.

అప్పటికే హోటల్‌లో ఉన్న చాలా మంది మంటలు రావడాన్ని గుర్తించి ప్రాణ భయంతో బయటకి పరుగులు తీశారు. అయితే దురదృష్టవశాత్తు కొందరు అందులోనే ఉండిపోయారు. బయటకి వద్దామన్నా దారి లేకపోవడంతో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.


ఈ ఘటనలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ 30 మందిని పోలీసులు రక్షించారు. ఇందుకోసం 8 అగ్నిమాపక యంత్రాలను ఘటనాస్థలికి చేర్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు.

EC: మోదీ, రాహుల్‌కు షాక్.. ఆ విషయంలో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు

హోటల్‌లో మంటలు ప్రారంభమై ఇతర భవనాలకు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. పోలీసులు హోటల్ మొదటి అంతస్థులో ఓ తల్లి కుమార్తె మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో హోటల్ సెల్లార్‌లో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. “మంటలను అదుపులోకి తెచ్చాం. మాకు ఉదయం 11 గంటలకు సమాచారం అందింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటాం. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని డీఐజీ మృత్యుంజయ్ కుమార్ చౌదరి వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై సీఎం నితీశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


సమీపంలోనే హత్య..

పట్నాలోని పున్‌పున్ ప్రాంతంలో JD(U) నేతని మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపిన కొద్ది గంటలకే హోటల్ ప్రమాదం జరిగింది. జేడీయూ నేత సౌరవ్ కుమార్ బుధవారం అర్ధరాత్రి 12.15 గంటలకు ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో సౌరవ్ అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని మసౌర్హి ఎస్‌డీపీఓ కన్హయ్య సింగ్ తెలిపారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 05:09 PM