Share News

Bangalore Rave Party: రేవ్ పార్టీలో పాల్గొన్నది వారే.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

ABN , Publish Date - May 21 , 2024 | 01:20 PM

నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. మంగళవారం ఇదే విషయమై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ.. సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని వెల్లడించారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని.. ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సీపీ తెలిపారు.

Bangalore Rave Party: రేవ్ పార్టీలో పాల్గొన్నది వారే.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..
Bangalore Rave Party

బెంగళూరు, మే 21: నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. మంగళవారం ఇదే విషయమై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ.. సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని వెల్లడించారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని.. ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సీపీ తెలిపారు. అంతేకాదు.. ఈ పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఈ పార్టీలో ఒక నటి ఉన్నారని.. వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని సీపీ అన్నారు. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని.. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు.


తప్పించుకునేందుకు అలా చేశారు..

కాగా, రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని సీపీ దయానంద్ తెలిపారు. అంతేకాదు.. డ్రగ్స్ దొరక్కుండా నాశనం చేసే ప్రయత్నం చేశారన్నారు. స్విమ్మింగ్ పూల్స్, ప్రహరీ వెలుపల పడేశారన్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా డ్రగ్స్‌ని గుర్తించామనిన చెప్పారు సీపీ. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశామని.. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందని సీపీ దయానంద్ తెలిపారు.


ఏబీఎన్ చేతికి రేవ్ పార్టీ రిపోర్ట్..

హైదరాబాద్ బిజినెస్ మెన్ వాసు ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో ఈ రేవ్ పార్టీని నిర్వహించారు. 101 మంది ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలువురు ప్లెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించారు. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తూ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. సోమవారం సాయంత్రం 3 గంటలకు పార్టీ నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్‌‌పై రైడ్ చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు వాసు, అరుణ్, సిద్ధికి, రణధీర్, రాజ్ భవ్ ఉన్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల అదుపులో ఈ ఐదుగురు నిందితులు ఉన్నారు. వాసు, అరుణ్ బంధువులు కాగా.. వాసు బర్త్ డే సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ ఈవెంట్ మొత్తానికి ఇన్చార్జిగా అరుణ్ వ్యవహరించాడు. ఇక ఈ పార్టీలో పాల్గొన్న డ్రగ్ పెడ్లర్లు సిద్ధికి, రణధీర్, రాజ్ భవ్ డ్రగ్స్ విక్రయాలు జరిపారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించారు.


తెలుగు రాష్ట్రాల ప్రముఖులు..

ఈ రేవ్ పార్టీకి రెండు తెలుగు రాష్టాల నుండి తెలుగు చలన చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు క్రికెట్ బుకీలు, హాజరైనట్లు సమాచారం. మొత్తం 100 మంది పైగా పార్టీకి హాజరవగా.. వీరిలో 30 మంది మహిళలు ఉన్నారు. అందులో 25 మంది యువతులు ఉన్నారు. ఇక ఈ పార్టీలో 45 గ్రాములు MDMA, కోకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే 18 లగ్జరీ కార్లు సీజ్ చేశారు పోలీసులు.

For More National News and Telugu News..

Updated Date - May 21 , 2024 | 01:42 PM