Share News

Punjab : నాడు డ్రగ్స్ మత్తు.. నేడు నకిలీ మందు చిచ్చు.. ఎన్నికల వేళ 20కి చేరిన మరణాలు..

ABN , Publish Date - Mar 23 , 2024 | 03:44 PM

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్‌ ( Punjab ) లోని సంగ్రూర్‌లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్‌ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Punjab : నాడు డ్రగ్స్ మత్తు.. నేడు నకిలీ మందు చిచ్చు.. ఎన్నికల వేళ 20కి చేరిన మరణాలు..

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్‌ ( Punjab ) లోని సంగ్రూర్‌లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్‌ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఐపీసీ, ఎక్సైజ్ చట్టం కింద హత్య కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా పూర్తి స్థాయి విచారణకు జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నకిలీ మద్యం విక్రయించిన గుర్లాల్ సింగ్ తో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.

గుజ్రాన్, ఉపాలి, దండోలి గ్రామాల్లో 11 మంది మరణించగా శుక్రవారం సునమ్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మరో 11 మంది పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రిలో, ఆరుగురు సంగ్రూర్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు 200 లీటర్ల ఇథనాల్, 156 మద్యం బాటిళ్లు, 130 కల్తీ మద్యం సీసాలు, లేబుల్ లేని నకిలీ మద్యం ఉన్న 80 సీసాలు, 4,500 ఖాళీ సీసాలు, బాట్లింగ్ మెషిన్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన మొత్తం వ్యవహారాన్ని ప్రొఫెషనల్, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఎన్నికల నేపథ్యంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. బాధిత గ్రామాల్లో ఇంకా ఎవరికైనా ఆరోగ్యం క్షీణించి ఉన్నారేమోనని తెలుసుకోవడానికి సర్వేను కూడా నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 03:44 PM