Share News

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

ABN , Publish Date - Feb 28 , 2024 | 09:34 PM

జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్‌కు సమీపంలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశాడు. రైలు మార్గం అంచు నుంచి దుమ్ము లేవడంతో మంటలు చెలరేగుతున్నాయేమోనని అనుమానించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు రైలు దిగారు. పక్కననున్న ట్రాక్‌పై నిలబడి ఉండగా ఇదే సమయంలో అటుగా వచ్చిన మరో ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణికుల మీద నుంచి దూసుకెళ్లింది. కాగా సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మరికొన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Feb 28 , 2024 | 09:34 PM