Share News

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టంకేసు.. కోర్టు ఏం చేసిందంటే..

ABN , Publish Date - Mar 17 , 2024 | 10:37 AM

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టంకేసు.. కోర్టు ఏం చేసిందంటే..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2013లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఆరోపించినందుకు ఇమ్రాన్ ఖాన్‌కు 20 బిలియన్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపారు. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చౌదరి లీగల్ టీమ్ హెచ్చరించింది. 2015లో అధికారికంగా కేసు నమోదు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. నాపై దాడికి పాల్పడే అవకాశం ఉందని చౌదరి పరువు నష్టం దావాలో పేర్కొన్నారు. దీంతో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ సందర్శనపై అధికారులు 2 వారాల నిషేధం విధించారు. ఈ పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన కోర్టు పరువు నష్టం ఆర్డినెన్స్ 2022 ప్రకారం పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ప్లాటిఫ్ దావా వేయాలని తెలిపింది. అలా చేయకపోతే సెక్షన్ 12 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. సుదీర్ఘ విచారణ అనంతరం చౌదరి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.


పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్నారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదివి కోల్పోయిన ఆయన అనేక న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాగా.. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ అనుబంధ అభ్యర్థులు ఆధిపత్యం చెలాయించడం విశేషం.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2024 | 10:37 AM