Share News

Bus Crash: టన్నెల్‌ను ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి, 37 మందికి గాయాలు

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:35 PM

ఓ ప్రయాణికుల బస్సు(bus crashes) ఆకస్మాత్తుగా వచ్చి సొరంగం గోడను ఢీకొట్టింది. దీంతో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు.

Bus Crash: టన్నెల్‌ను ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి, 37 మందికి గాయాలు

ఓ ప్రయాణికుల బస్సు(bus crashes) ఆకస్మాత్తుగా వచ్చి సొరంగం గోడను ఢీకొట్టింది. దీంతో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర చైనా(china)లోని షాంగ్సీ ప్రావిన్స్‌లో(Shanxi province) చోటుచేసుకుంది. హుబేయ్ ఎక్స్‌ప్రెస్‌వేపై మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రమాదం జరిగిందని చైనా ప్రభుత్వ మీడియా బుధవారం సమాచారం ఇచ్చింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు.


అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు(bus)లో 51 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా లేదా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదం చేశారా అనేది తెలియాల్సి ఉంది. బస్సులో అనేక మంది ప్రయాణికులు ఉన్నట్లు సీసీటీవీ(cctv) వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరోవైపు గత వారం చైనా(china)లో జరిగిన మరో ప్రమాదంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును దూరం నుంచి వచ్చిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది(accident). ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో 37 మంది గాయపడ్డారని అక్కడి అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరో ప్రమాదం జరగడం ప్రస్తుతం బస్సుల ప్రమాదాలు హాట్ టాపిక్‌గా మారాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

Updated Date - Mar 20 , 2024 | 04:36 PM