Share News

World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:05 AM

వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.

World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టు(World Happiness Report 2024)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్(finland) వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది. ఈ ఇండెక్స్‌లో గతేడాది మాదిరిగానే భారత్(bharat) 126వ స్థానంలోనే నిలిచింది. UN ప్రాయోజిత వార్షిక నివేదిక ప్రకారం 146 దేశాల్లో ఇండియా 126వ స్థానంలో ఉందంటే మనం సంతోష జాబితాలో చాలా వెనుకబడి ఉన్నామని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఆప్గానిస్తాన్ మరోసారి అట్టడుగు స్థానంలో నిలిచింది.

వరల్డ్ హ్యాపీనెస్ 2024 నివేదికలో టాప్ 10 దేశాలు

1. ఫిన్లాండ్

2. డెన్మార్క్

3. ఐస్లాండ్

4. స్వీడన్

5. ఇజ్రాయెల్

6. నెదర్లాండ్స్

7. నార్వే

8. లక్సెంబర్గ్

9. స్విట్జర్లాండ్

10. ఆస్ట్రేలియా


ఆసక్తికరమైన విషయమేమిటంటే టాప్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని పెద్ద దేశాలు లేకపోవడాన్ని నివేదిక ప్రత్యేకంగా గుర్తు చేసింది. మొదటి 10 స్థానాల్లో అమెరికా(america), జర్మనీ, కెనడా, UK వంటి 30 మిలియన్లకు మించిన దేశాలు మొదటి 20 స్థానాల్లో లేవని తెలిపింది. గణనీయమైన జనాభా ఉన్న ఈ దేశాలు సంతోషకరమైన స్థాయిలో దిగజారుతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్, జర్మనీలు వరుసగా 23, 24వ స్థానాల్లో నిలిచాయి.

సంతోషకరమైన దేశం ఎలా గుర్తిస్తారు ?

ఏ దేశం ఎక్కువ సంతోషంగా ఉంది, ఏ దేశం తక్కువ సంతోషంగా ఉంది అనేది అనేక విషయాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఈ ర్యాంకింగ్‌ను కొలవడానికి ఆరు కీలక అంశాలను ఉపయోగిస్తారు. ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం, సోషల్ సపోర్ట్ వంటి అంశాలను ప్రమాణికంగా తీసుకుంటుంది.

అయితే ప్రతి ఏటా మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే జరుపుకుంటారు. దీనిని 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(UNO) ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఈరోజును జరుపుతున్నారు. ఈ సంవత్సరం థీమ్ 'రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రెసిలెంట్ కమ్యూనిటీస్'.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Zomato: జొమాటో 'గ్రీన్ యూనిఫాం' నిర్ణయం ఉపసంహరించుకున్న సంస్థ

Updated Date - Mar 20 , 2024 | 11:05 AM