Share News

Harry Potter Castle: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. హ్యారీపోటర్ కోట ధ్వంసం

ABN , Publish Date - May 01 , 2024 | 05:08 PM

ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది.

Harry Potter Castle: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. హ్యారీపోటర్ కోట ధ్వంసం

ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని (Harry Potter) అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia-Ukraine War) భాగంగా ధ్వంసమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న అత్యంత సుందర భవనాల్లో ఒకటైన ఈ విద్యా సంస్థ భవనంపై.. రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడి జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు.

మొత్తం ముంబై జట్టుకి పెద్ద షాక్.. హార్దిక్ పాండ్యాకి భారీ దెబ్బ

ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అంతేకాదు.. ఒక గర్భిణీతో పాటు ఇద్దరు పిల్లలను కలిపి మొత్తం 30 మంది తీవ్ర గాయాలపాలైనట్టు తెలిసింది. అలాగే.. 20 నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. ఈ క్షిపణి పడిన చోట నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడ్డాయని ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ దాడికి సంబంధించిన ఫోటోలు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ ఆండ్రీ కోస్టిన్ విడుదల చేశారు. వాటిల్లో హ్యారీపోటర్ కోట మంటల్లో దగ్ధమయ్యే దృశ్యాలూ ఉన్నాయి. ఈ దాడిలో రష్యా ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణి, క్లస్టర్ ఆయుధాలను ఉపయోగించిందని అధికారులు భావిస్తున్నారు.


క్యాన్సర్ పేషెంట్‌కి బంపరాఫర్.. ఏకంగా రూ.10 వేల కోట్లు

‘‘ఈ దాడిలో రష్యా వినియోగించిన ఆయుధం ఎంతో ప్రమాదకరమైంది. ఇది గణనీయమైన పౌర ప్రాణనష్టానికి దారి తీస్తుంది. ఈ దాడి జరిగిన ప్రాంతం నుంచి 1.5 కి.మీ పరిధిలో మెటల్ శకలాలు, క్షిపణి శిధిలాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మా దర్యాప్తులో భాగంగా.. వీలైనంతమంది ఉక్రేనియన్ పౌరులను చంపేందుకు రష్యన్ సాయుధ దళాలు ఈ ఆయుధాన్ని ఉద్దేశపూర్వకంగా వినియోగించినట్లు తేలింది’’ అని ఆండ్రీ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, శాంతియుతమైన ఉక్రేనియన్ నగరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించే వారిని కనుగొని, తప్పకుండా శిక్షిస్తామని ఓ ఉక్రెయిన్ అధికారి హెచ్చరించారు.

మరోవైపు.. క్రిమియాలోని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.. ఉక్రెయిన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌కు చెందిన ఆయుధాలున్నాయని, వీటితోపాటు 10 డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. ఎయిర్‌ఫీల్డ్‌లను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఈ దాడులు జరపగా.. ఎయిర్ డిఫెన్స్ దానిని నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.

Read Latest International News and Telugu News

Updated Date - May 01 , 2024 | 05:11 PM