Share News

Hamas Terrorist: చనిపోయినా వదలని కామాంధులు.. ఒకరి తరువాత ఒకరుగా..!

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:41 PM

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.

Hamas Terrorist: చనిపోయినా వదలని కామాంధులు.. ఒకరి తరువాత ఒకరుగా..!
Hamas Terrorist Attack

జెరూసలెం, జనవరి 5: ఇజ్రాయెల్, పాలస్తీనా టెర్రరిస్టు సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈ యుద్ధానికి ఆరంభించి మాత్రం హమాస్ టెర్రరిస్టులే. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ టెర్రరిస్టులు భీకర దాడి చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. వేలాది లాంచర్లతో దాడులు చేసి ఇజ్రాయెల్‌ను వణికించారు. అయితే, దాడి సమయంలో హమాస్ టెర్రరిస్టులు క్రూరాతి క్రూరంగా ప్రవర్తించినట్లు.. వారి చర నుంచి తప్పించుకొని బయటపడిన బాధితులు వెల్లడించారు. వారు చెప్పి వివరాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి.

ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన దురాగతాన్ని ప్రపంచం ముందుంచాడు.

కోహెన్ తెలిపిన వివరాల ప్రకారం.. కోహెన్ తన స్నేహితురాలు మాయతో కలిసి దక్షిణ ఇజ్రాయెల్‌ ఎడారిలోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లాడు. అయితే, అదే సమయంలో దాడి చేసిన హమాస్ టెర్రరిస్టులు.. మాయను తమ బంధీగా తీసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఆమెను కాల్చి చంపేశారు.

'నేను పరుగెత్తి ఒక పొదలో దాక్కున్నాను. ఇంతలో మరో యువతి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఆమెను సైతం తలపై కాల్చి చంపేశారు. నేను పొదల చాటున దాక్కోగా.. ఇంతలో తెల్లటి వ్యాన్ ఒకటి వచ్చింది. వ్యాన్ నుంచి దిగిన ఐదుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని బంధీగా చేసుకుని ఆమె డ్రెస్ విప్పేశారు. ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత అతను కత్తి తీసుకుని యువతి గొంతు కోసి చంపేశాడు. అయితే, అమ్మాయి చనిపోయినా ఆ కీచకులు వదల్లేదు. చనిపోయిన మృతదేహాన్ని కూడా నలుగురు టెర్రరిస్టులు రేప్ చేశారు. ఆమెను చంపి అత్యాచారం చేస్తూ పెద్ద పెద్దగా రాక్షసానందంతో నవ్వారు. వారు కేవలం సరదా కోసం ఎంతో మందిపై అఘాయిత్యం చేసి చంపేశారు.' అని కోహెన్ తాను చూసిన దురాఘతాలను వివరించాడు.

అయితే, కోహెన్ ఆరోపణలను హామాస్ ఖండించింది. కానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా సరిహద్దు సమీపంలోని మ్యూజిక్ ఫెస్టివల్, కిబ్బట్జ్ కమ్యూనిటీలపై దాడి సమయంలో జరిగిన అత్యాచారం, లైంగిక హింస కేసులను నమోదు చేసింది. ఈ దాడుల్లో 1,200 మంది చనిపోయారు. 200 మందికి పైగా ప్రజలు హమాస్ బందీలుగా ఉన్నారని పేర్కొంది. అంతేకాదు.. 'స్క్రీమ్స్ వితౌట్ వర్డ్స్' పేరిట ఇజ్రాయెల్‌లో హమాస్ పాల్పడిన దురాగతాలకు సంబంధించి నివేదికన విడుదల చేసింది. రెండు నెలల విచారణలో ఏడు ప్రదేశాలలో ఇజ్రాయెల్ మహిళలు, బాలికలపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.

Updated Date - Jan 05 , 2024 | 05:41 PM