Share News

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:54 AM

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు(womens) ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్‌లైన్స్‌కు అధ్యక్షులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Airlines: ఒకప్పుడు ఫ్లైట్ అటెండెంట్.. ఇప్పుడు అదే ఎయిర్‌లైన్స్‌కు బాస్
Former flight attendant Mitsuko Tottori becomes Japan Airlines

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు(womens) ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్‌లైన్స్‌కు అధ్యక్షులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. జపాన్ ఎయిర్‌లైన్స్ (Japan Airlines) కార్పొరేట్ ప్రపంచంలో లింగ అసమానతలను తొలగించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, మొదటిసారిగా మిత్సుకో టోటోరి(Mitsuko Tottori) అనే మహిళను అధ్యక్షురాలిగా నియమించింది. ఈ మహిళ 1985లో JALలో చేరిన సీనియర్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు ఆమె ఇటివల కొత్తగా అధ్యక్షురాలిగా పదవిని చేపట్టారు.


ఇది కేవలం కార్పోరేట్ లీడర్ల మైండ్‌సెట్ గురించి మాత్రమే కాదు, మహిళలు మేనేజర్‌గా మారడానికి విశ్వాసం కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యమని టోటోరి(Mitsuko Tottori) ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఇప్పుడు నాయకత్వ పాత్రను పోషిస్తున్నందున, కెరీర్ సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులకు ఆమె నియామకం స్ఫూర్తినిస్తుందని టోటోరి భావిస్తున్నారు. మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుని పర్యాటకాన్ని మరోసారి పెంచాలని JAL లక్ష్యంగా పెట్టుకున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.


ఇటీవలి సంవత్సరాలలో లింగ బేధం విషయంలో జపాన్(japan) ఒత్తిడిని ఎదుర్కొంటున్న క్రమంలోనే JAL ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో జపాన్‌లో మహిళా బాస్‌ల సంఖ్యను పెంచేందుకు జపాన్ ప్రభుత్వం దాదాపు దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. 2020 నాటికి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన తర్వాత, 2030 నాటికి ప్రధాన వ్యాపారాలలో మూడో వంతు నాయకత్వ స్థానాలు మహిళలకు వెళ్లాలని కోరుతోంది. ఈ క్రమంలో లింగ సమానత్వం పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

Shyam Pitroda: సంపన్నులు చనిపోతే వారి సంపద తీసుకునే చట్టం రూపొందించాలి


Read Latest International News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 10:00 AM