Share News

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:32 AM

ఏప్రిల్ నెల ముగిసేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని రోజుల్లో మే నెల మొదలు కానుంది. అయితే ఈసారి మే(May 2024) నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్(Bank Holidays) కానున్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: మేలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
Bank Holidays in May 2024

ఏప్రిల్ నెల ముగిసేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని రోజుల్లో మే నెల మొదలు కానుంది. అయితే ఈసారి మే(May 2024) నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు బంద్(Bank Holidays) కానున్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈసారి దాదాపు 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకు సెలవులను చూసుకుని మీ సంబంధిత పనులను ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మీరు తరువాత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.


మే 2024 బ్యాంకు సెలవుల(Bank Holidays in May 2024) జాబితా

  • మే 1: కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం (మే డే కావడంతో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)

  • మే 5: ఆదివారం

  • మే 8: రవీంద్రనాథ్ జయంతి (రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు)

  • మే 10: బసవ జయంతి, అక్షయ తృతీయ (బెంగళూరులో సెలవు)

  • మే 11: రెండవ శనివారం

  • మే 12: ఆదివారం


  • మే 16: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు

  • మే 19: ఆదివారం

  • మే 20: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో (బేలాపూర్, ముంబైలో బ్యాంకులకు సెలవు)

  • మే 23: బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, భోపాల్, బేలాపూర్, డెహ్రాడూన్, ఇటానగర్, చండీగఢ్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు బంద్

  • మే 25: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • మే 26: ఆదివారం

అయితే ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి స్థానిక ప్రజలు సెలవు రోజులను చూసుకుని బ్యాంకులకు వెళ్లి మీ పనులను పూర్తి చేసుకోవచ్చు.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే

IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి



Read Latest Business News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 11:35 AM