Share News

Bangladesh: సార్వత్రిక ఎన్నికల వేళ చెలరేగిన హింస.. ఐదుగురు సజీవ దహనం

ABN , Publish Date - Jan 06 , 2024 | 07:43 AM

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.

Bangladesh: సార్వత్రిక ఎన్నికల వేళ చెలరేగిన హింస.. ఐదుగురు సజీవ దహనం

ఢాకా: మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. "స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల" కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. శుక్రవారం రాత్రి ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించడంతో కనీసం ఐదుగురు సజీవదహనం అయ్యారు. అనేక మంది గాయపడ్డారు. రాజధాని ఢాకాలోని గోపీబాగ్ ప్రాంతంలో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ది డైలీ స్టార్ కథనం ప్రకారం.. గోపీబాగ్ ప్రాంతంలో రైలులో శుక్రవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.


వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. రాత్రి 10.20 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఢాకా వెళ్లే రైలులోని ఐదు భోగీలకు దుండగులు నిప్పటించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నాలుగు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఆ నాలులు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. రైలులో చాలామంది భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాణ నష్టాన్ని గుర్తించేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దగ్దమైన రైలులో ఇంకా చాలా మంది ప్రయాణికులు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను బయటికి తీసినట్లు ఫైర్ సిబ్బంది చెప్పారు. చాలా మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ రైలు బంగ్లాదేశ్‌లోని అతి ముఖ్మమైన ల్యాండ్ పోర్ట్ అయినా బెనాపోల్ నుంచి ఢాకాకు ప్రయాణిస్తుంది. కాగా బంగ్లాదేశ్‌లో ఆదివారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Updated Date - Jan 06 , 2024 | 07:43 AM