Share News

WeightLoss: ఎంత బరువున్నా సరే.. ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ తింటే చాలు.. ఈజీగా బరువు తగ్గిపోవచ్చట!

ABN , Publish Date - Feb 08 , 2024 | 02:38 PM

ఈ ఆహారాలు బరువు తగ్గించడంలో సూపర్ ఫుడ్స్ అని చెప్పడంలో సందేహామే లేదు..

WeightLoss: ఎంత బరువున్నా సరే.. ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ తింటే చాలు.. ఈజీగా బరువు తగ్గిపోవచ్చట!

అధిక బరువు ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య. బరువు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలామంది బరువు తగ్గడానికి ప్రత్నిస్తుంటారు. కొందరు వాకింగ్, యోగా మీద ఆధారపడితే మరికొందరు జిమ్ లో కసరత్తులు, వ్యాయామాలు చేస్తారు. మరికొందరు ఆహారంతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. అయితే బరువు తగ్గడంలో కొన్ని ఆహారాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కింద చెప్పుకునే ఆహారాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంత బరువున్న వారైనా సరే.. ఈజీగా బరువు తగ్గెయచ్చు. అవేంటో ఓ లుక్కేస్తే..

మెంతులు..

రాత్రి పడుకునేముందు ఒక స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే మెంతులు నానిన నీటిని తాగాలి. కావాలంటే ఆ నానిన మెంతులు కూడా తినచ్చు. ఇది ఆకలిని తగ్గించి బరువు నియంత్రించడంతో పాటూ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించంలో కూడా సహాయపడుతుంది.

ఇదికూడా చదవండి: వాస్తు ప్రకారం పడకగదిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


కలబంద జ్యూస్..

ఒక గ్లాసు నీటిలో తాజా కలబంద జెల్ తీసుకుని మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి. దీన్ని జ్యూస్ లా చేసుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. జీర్ణసమస్యలను నివారించడంతో పాటూ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తాజా కలబంద అందుబాటులో లేకుంటే మార్కెట్లో దొరికే జ్యూస్ కూడా ఉపయోగించవచ్చు.

దోసకాయ..

ఉదయాన్నే దోసకాయను తీసుకోవడం వల్ల చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

బొప్పాయి..

పోషకాలు అధికంగా ఉన్న బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే బాగా పండిన బొప్పాయి తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

క్యారెట్ బీట్రూట్ జ్యూస్..

బరువు ఈజీగా తగ్గడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కు మించిన డ్రింక్ లేదు. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గ్లాసుడు జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా చర్మం నిగారింపు వస్తుంది.

ఇది కూడా చదవండి: Grapes: నలుపు Vs ఎరుపు Vs ఆకుపచ్చ.. ఏ ద్రాక్షలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మేలంటే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 02:38 PM