Share News

Grapes: నలుపు Vs ఎరుపు Vs ఆకుపచ్చ.. ఏ ద్రాక్షలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మేలంటే..!

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:40 PM

మూడు ద్రాక్షలు రంగులో తేడాలున్నట్టే వీటి పోషకాలలో ఏమైనా తేడాలున్నాయా? ఏది ఆరోగ్యానికి మంచిది? అసలు నిజాలివీ..

Grapes: నలుపు Vs ఎరుపు Vs ఆకుపచ్చ.. ఏ ద్రాక్షలో పోషకాలు ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మేలంటే..!

ద్రాక్ష అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు. తీపి పులుపు కలయికతో జ్యూసీగా ఉండే ఈ పండ్లు చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తాయి. వీటిలో మూడు రకాలున్నాయి. ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులలో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా ఆకుపచ్చ, నలుపు ద్రాక్ష ఎక్కువగా దొరుకుతుంది. ఎరుపు ద్రాక్ష కూడా పట్టణాలలో లభ్యమవుతుంది. మూడు ద్రాక్షలు రంగులో తేడాలున్నట్టే వీటి పోషకాలలో ఏమైనా తేడాలున్నాయా? ఏది ఆరోగ్యానికి మంచిది? దేంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి? తెలుసుకుంటే..

రుచి విషయంలో ఈ మూడు ద్రాక్షలు వేర్వేరు రుచిని కలిగి ఉంటాయి. నల్లద్రాక్ష కొద్దిగా పులుపు తీపు కలయికతో ఉంటుంది. ఆకుపచ్చ ద్రాక్ష రుచి చాలా తాజాగా ఉంటుంది. ఇది తేలిక తీపితో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక ఎరుపు ద్రాక్ష పులుపు తీపితో కలిసి ఉంటుంది.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!


మూడు రకాల ద్రాక్షలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా విభిన్నంగా ఉంటాయి. అయితే నల్లద్రాక్షలో వాటి రంగు కారణంగా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

ద్రాక్షలో ఎరుపు, ఆకుపచ్చ ద్రాక్షలను వైన్ తయారీకి ఉపయోగిస్తారు. రెడ్ వైన్ తయారుచేయడానికి అయితే నల్ల ద్రాక్షను వినియోగిస్తారు.

ద్రాక్షలలో కేలరీలు తక్కువ, నీటి కంటెంట్ ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుతాయి. విటమిన్-సి, కె, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

ఇది కూాడా చదవండి: నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 07 , 2024 | 03:40 PM