Share News

Vegetable Juice: ఈ నాలుగు ఆకుకూరల జ్యూస్ లో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. కాలేయం సేఫ్..!

ABN , Publish Date - May 15 , 2024 | 03:05 PM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. పిత్త రసాన్ని ఉత్పత్తి చేయడం, రక్తాన్ని శుభ్రపరచడం, జీర్ణక్రియను సజావుగా నిర్వహించడం, శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను నిల్వ చేయడంలో కాలేయం పనిచేస్తుంది. ఆహారం సరిగా లేకుంటే లేదా చెడు జీవనశైలి అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది.

Vegetable Juice:  ఈ నాలుగు ఆకుకూరల జ్యూస్ లో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. కాలేయం సేఫ్..!

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. పిత్త రసాన్ని ఉత్పత్తి చేయడం, రక్తాన్ని శుభ్రపరచడం, జీర్ణక్రియను సజావుగా నిర్వహించడం, శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను నిల్వ చేయడంలో కాలేయం పనిచేస్తుంది. ఆహారం సరిగా లేకుంటే లేదా చెడు జీవనశైలి అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని కూరగాయలు, ఆకుకూరల జ్యూస్ లను తాగవచ్చు. ఈ జ్యూస్‌లు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, కాలేయాన్ని శుభ్రపరచడంలోనూ సహాయపడతాయి. ఈ జ్యూసులేంటో తెలుసుకుంటే..

క్యారెట్ జ్యూస్ - క్యారెట్ జ్యూస్ కాలేయానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తరువాత విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!


బీట్‌రూట్ జ్యూస్ – బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్నాయి. బీట్‌రూట్‌లో ఉండే అధిక యాంటీ-ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరచడంలో పని చేస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని పాడుచేసే టాక్సిన్‌లను తొలగిస్తుంది.

స్పినాచ్ జ్యూస్ - యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పాలకూర కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా పనిచేస్తుంది. యాంటీ-ఆక్సిడెంట్లు కాలేయాన్ని దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి. అంతేకాదు ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. పాలకూర జ్యూస్ ను నిమ్మరసం, కొద్దిగా ఉప్పు కలిపి తాగవచ్చు.

నెయ్యి - కాలేయ మంటను తొలగించడానికి నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 15 , 2024 | 03:05 PM