Potato: ఎప్పుడూ రొటీన్ గా కాదు.. బంగాళాదుంపలు ఇలా ట్రై చేస్తే లొట్టలేసుకుంటూ తినేస్తారు..!
ABN , Publish Date - Jan 19 , 2024 | 01:56 PM
రొటీన్ గా కాకుండా బంగాళాదుంపలను ఇలా వండితే రుచి అమోఘం అంతే..
బంగాళాదుంప కార్బోహేడ్రేట్లు అధికంగా ఉన్న దుంప కూరగాయ. బంగాళాదుంపలను చిప్స్ గానూ, ఫ్రెంచ్ ఫ్రైస్ గానూ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కూరలు, స్నాక్స్, సైడ్ డిష్ లు ఇలా ఎందులో అయినా బంగాళాదుంప చక్కగా ఒదిగిపోతుంది. చలికాలంలో బంగాళాదుంపలు తింటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. బయటి వాతావరణానికి తగినట్టు శరీరం బ్యాలెన్స్డ్ గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే రొటీన్ గా కాకుండా బంగాళాదుంపలను కింది విధాలుగా ట్రై చేస్తే బోర్ అనకుండా లొట్టలేసుకుంటూ తినేస్తారు.
మేతీ ఆలూ..
మేతీ ఆలూ క్లాసికల్ రుచిని పరిచయం చేస్తుంది. మెంతి ఆకుల మృదుత్వం, బంగాళాదుంపల రుచి రెండూ కలిస్తే నాలుకకు, ఆరోగ్యానికి కూడా సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇది కొద్దిగా చేదు టచింగ్ ఇస్తుంది కానీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూరుస్తుంది.
ఇది కూడా చదవండి: Jaggery Chapati: బెల్లం చపాతీల గురించి తెలుసా? ముఖ్యంగా చలికాలంలోనే వీటిని ఎందుకు తింటారంటే..!
ఆలూ పాలక్ పరాతా..
చపాతీ లాంటిది కానీ.. చపాతి కాదు ఇది. పరాతాలు ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా తింటారు. బంగాళాదుంప, పాలకూర రెండింటిని స్టఫ్ చేసి మందంపాటి చపాతీలల్లా వత్తుకుని నెయ్యితో కాలుస్తారు. పాలకూరలో ఫైబర్, బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్స్ ఇత ఖనిజాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. ఉదయం అల్పాహారం కోసమైనా, రాత్రి డిన్నర్ కోసమైనా ఇవి భలే సెట్ అవుతాయి.
బంగాళాదుంప పల్లెం..
ఇది దక్షిణభారతదేశ వంటగదిలో పుట్టిన రుచికరమైన కూర. దోసెలు, పూరీలకు ఇది గొప్ప కాంబినేషన్. ఇది బంగాళాదుంప పల్యా పేరుతో దేశం మొత్తం మీద ఫ్యాన్ ను సంపాదించుకుంది.
పాలకూర, బంగాళాదుంప సూప్..
చలికాలంలో శరీరానికి వెచ్చదనం కావాలన్నా, నోటికి బాగా రుచిగా ఉండాలన్నాబంగాళాదుంప, పాలకూర సూప్ భలే ఉంటుంది. ఇది ఉదయం అల్పాహారంతో అయినా లేదా సాయంత్రం చల్లని వేళలో తీసుకున్నా బావుంటుంది. ఇది క్రీమీగా, మిరియాలు, అల్లం, వెల్లుల్లి కాంబినేషన్ తో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి: చలికాలంలో బొప్పాయి తింటే కలిగే టాప్ 7 ప్రయోజనాలు ఇవీ..!
షరక్కండి చాట్..
బంగాళాదుంపతో ఎప్పుడూ మసాలాలు, కారంతో కూడిన స్నాక్స్ మాత్రమే కాదు తీపిని జోడించి చాట్ కూడా చేయవచ్చు. బంగాళాదుంపలు కాల్చి దానికి మసాలా దినుసులు, చింతపండు జోడించి చాట్ మసాలా చిలకరిస్తే షరక్కండి చాట్ తయారైనట్టే. ఇది తీపి, కారం, పులుపు రుచులతో చాలా బాగుంటుంది.
బంగాళాదుంప రైస్..
బంగాళాదుంపలను వెజిటబుల్ బిర్యానీ తరహాలో బియ్యంతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది లంచ్, డిన్నర్ కు మంచి ఎంపిక.
బంగాళాదుంప సూప్..
కాంబినేషన్ గా ఏమీ లేకపోయినా బంగాళాదుంపలతో సూప్ చేయవచ్చు. కాసింత పాలమీగడ జోడిస్తే ఈ సూప్ రుచి మరింత పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Vitamin-B12: అసలు విటమిన్-బి12 శరీరానికి ఎందుకు అవసరం? ఇది లోపిస్తే ఏం జరుగుతుందంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.