Share News

Vitamin-B12: అసలు విటమిన్-బి12 శరీరానికి ఎందుకు అవసరం? ఇది లోపిస్తే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:52 AM

శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్-బి12 కూడా ఒకటి. ఇది లోపిస్తే జరిగే పరిణామాలు ఇవే..

Vitamin-B12: అసలు విటమిన్-బి12 శరీరానికి ఎందుకు అవసరం? ఇది లోపిస్తే ఏం జరుగుతుందంటే..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బోలెడు పోషకాలు అవసరం. ఏ ఒక్కటి లోపించినా అది శరీరంలో ఇబ్బందులకు కారణం అవుతుంది. అవి మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్-బి12 చాలా ముఖ్యమైనది. ఇది శరీరానికి ఎందుకు ఏవసరమో.. విటమిన్-బి12ను భర్తీ చేసుకోవడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుంటే..

విటమిన్-బి12 ఇందుకే అవసరం..

శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేయడంలో లేదా నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. జీవితంలో బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలను విటమిన్-బి12 తీసుకోవడం ద్వారా నిరోధించవచ్చు.

విటమిన్ B12 మంచి మూడ్ బూస్టర్. సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా విటమిన్-బి12 తీసుకుంటూ ఉంటే డిప్రెషన్ సమస్యలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉంచుతుంది. మెదడులోని న్యూరాన్లకు అవసరమైన పోషకం విటమిన్ B12.

విటమిన్-బి12 సరైన మొత్తంలో తీసుకుంటే శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది.

శరీరానికి సరిపడినంత విటమిన్-బి12 తీసుకుంటూ ఉంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఈ పోషకం సరైన మొత్తంలో ఉండటం వల్ల మీ చర్మం, గోర్లు, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇదికూడా చదవండి: మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!


విటమిన్-బి12 లోపం లక్షణాలు..

కారణం లేకుండా అలసటగా అనిపించడం. చర్మం పాలిపోవడం. తరచుగా తలనొప్పి రావడం. ఏకాగ్రత విషయంలో నిలకడ లేకపోవడం. నోరు, నాలుక బాగా ఇబ్బందిగా నొప్పి పెట్టడం.

విటమిన్-బి12 లభ్యమయ్యే ఆహాలివే..

మాంసం.. ముఖ్యంగా జంతువుల కాలేయం, మూత్రపిండాలలో విటమిన్-బి12 లభిస్తుంది. అలాగే చేపలు కూడా విటమిన్-12 కు మంచి వనరులు. ఈస్ట్ లోనూ విటమిన్-బి12 ఉంటుంది.

శాకాహారం తీసుకునేవారికి కూడా విటమిన్-బి12 కోసం మంచి ఎంపికలు ఉన్నాయి. పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవాటిలో విటమిన్-బి12 లభిస్తుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో బొప్పాయి తింటే కలిగే టాప్ 7 ప్రయోజనాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 12:04 PM