Share News

Olive Oil: సాధారణ నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడితే ఏం జరుగుతుంది? ఈ 5 నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - May 15 , 2024 | 03:35 PM

ఆరోగ్యం కోసం వైద్యులు తరచుగా సూచించే నూనెలలో ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు, వివిధ రకాల పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

Olive Oil: సాధారణ నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడితే ఏం జరుగుతుంది? ఈ 5 నిజాలు తెలిస్తే..!

ఆరోగ్యం కోసం వైద్యులు తరచుగా సూచించే నూనెలలో ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను వంటల్లో ఉపయోగిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు, వివిధ రకాల పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆలివ్ నూనెలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి, మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి, విటమిన్ E తో పాటూ యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనెలో పాలీఫెనాల్స్ కూడా ఉన్నాయి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఈ నూనె శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే..

ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ధమనులను సడలించడం, తెరుచుకోవడంలో సహాయపడతాయి. తద్వారా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!


ఆలివ్ ఆయిల్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో జీర్ణక్రియకు ఉపయోగపడే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది.

ఆలివ్ నూనె రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనెలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ శరీరాన్ని అంటువ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతాయి.

బరువు నిర్వహణ కోసం ఆలివ్ నూనెను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ నూనె రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. ఆహారం పదే పదే తినాలనే కోరికలను తగ్గిస్తుంది. కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. ఇది బరువు తగ్గడమే కాకుండా జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!


ఆలివ్ ఆయిల్ శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనె మెదడు కణాల పెరుగుదల, మరమ్మత్తుకు అవసరమైన రసాయనాల స్థాయిలను పెంచుతుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మానసికంగా అలసిపోయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!

బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 15 , 2024 | 03:35 PM