Share News

Kids School Bag: పిల్లల స్కూల్ బ్యాగ్ ఏ వయసులో ఎంత బరువుండాలి? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:31 AM

స్కూల్ బ్యాగులో కేవలం పుస్తకాలే కాకుండా కొందరు తల్లులు లంచ్ బాక్స్ కూడా పెడుతుంటారు. దీని వల్ల బరువు మరింత పెరుగుతుంది. అసలు స్కూలు బ్యాగు ఎంతుండాలో తల్లిదండ్రుకు తెలియదు.

Kids School Bag: పిల్లల స్కూల్ బ్యాగ్ ఏ వయసులో ఎంత బరువుండాలి? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

నేటికాలం పిల్లలను చూస్తే ఒక్కోసారి బాధ వేస్తుంది. సున్నితమైన భుజాలకు బరువుగా ఉన్న స్కూల్ బ్యాగులను తగిలించుకుని భారంగా వాటిని పైకి తోసుకుంటూ వెళుతుంటారు. స్కూల్ బ్యాగులో కేవలం పుస్తకాలే కాకుండా కొందరు తల్లులు లంచ్ బాక్స్ కూడా పెడుతుంటారు. దీని వల్ల బరువు మరింత పెరుగుతుంది. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే భుజాలు నొప్పి పెడుతున్నాయంటూ తల్లిదండ్రుల దగ్గర వాపోతుంటారు. తల్లిదండ్రులు పిల్లల భుజాలను కాసేపు ఒత్తుతూ పిల్లలను ఊరడిస్తారు తప్ప ప్రత్యామ్నాయం గురించి ఆలోచించరు. కానీ పిల్లలు బ్యాగులను భుజాల మీద వేసుకునే తీరు నుండి స్కూల్ బ్యాగు బరువు వరకు పిల్లల భుజాలు, మెడ, వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తాయట.

పిల్లల స్కూల్ బ్యాగ్ ఏ వయసులో ఎంత బరువుండాలంటే..

1,2 తరగతుల పిల్లల స్కూల్ బ్యాగులు ఒకటిన్నర కిలో లోపు బరువుండాలి.

3వ తరగతి పిల్లలకు రెండు కిలోల లోపు స్కూలు బ్యాగు బరువుండాలి.

4-5 తరగతి పిల్లలకు 2 నుండి 3 కిలోల లోపు స్కూలు బ్యాగు బరువుండాలి.

6-8వ తరగతి పిల్లలకు 3 నుండి 4 కిలోల లోపు స్కూలు బ్యాగు బరువుండాలి.

9-10 తరగతుల పిల్లల స్కూల్ బ్యాగులు 5 కిలోల లోపు మాత్రమే ఉండాలి.

ఇది కూడా చదవండి: మాంసాహారం ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే!


బ్యాగ్ సెలక్షన్..

పిల్లల స్కూల్ బ్యాగుల బరువు గురించి మాత్రమే కాకుండా బ్యాగ్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యమని పిల్లల వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ఎప్పుడూ డ్యూయల్ స్ట్రిప్ బ్యాగులు తీసుకోవాలి. బ్యాగ్ ను రెండు భుజాలు సమానంగా మోస్తే కాసింత ఊరట ఉంటుంది. పిల్లలలో స్కూల్ బ్యాగ్ ను ఒకవైపు మోసే అలవాటు ఉంటే దాన్ని నివారించాలి. అలాగే బ్యాగ్ ప్యాక్ ఎప్పుడూ నడుముకు కిందగా ఉండకూడదు. అలా ఉంటే పిల్లల వెన్నెముక వంకరగా మారే అవకాశం ఉంటుంది. అదే విధంగా కండరాల మీద ఒత్తిడి, సంకోచ వ్యాకోచాలలో సమతుల్యత దెబ్బతినడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 07 , 2024 | 09:31 AM