Hung Curd: పెరుగు తినడానికి మీకు తెలియని పద్దతి ఇది.. భోజనంలో దీన్ని తింటే.. ఎన్ని లాభాలంటే..!
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:49 PM
ఈ మధ్యకాలంలో పెరుగు తినడానికి ఈ కొత్త రకం పద్దతి వైరల్ అవుతోంది. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాకవుతారు.
పెరుగు భారతీయుల భోజనంలో తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థం. పెరుగు లేకపోతే భోజనం సంపూర్ణం కాదు. సాదారణంగా కూడా పెరుగు అన్నం తింటే తృప్తిగా ఉంటుంది. పెరుగుతోనే ప్రత్యేకమైన వంటకాలు తయారుచేస్తుంటారు. కానీ పెరుగును మాములుగా కాకుండా విభిన్న పద్దతిలో తింటే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో హంగ్ పెరుగు చాలా వైరల్ అవుతోంది. తోడు పెట్టిన పెరుగును ఒక పలుచని నూలు బట్టలో వేసి వడగడతారు. ఇందులో తేమ మొత్తం పోయాక మిగిలిన పెరుగు క్రీమీగా, సాప్ట్ గా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పెరుగును భోజనంలో ఖచ్చితంగా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. వడగట్టిన పెరుగు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూస్తే..
ప్రొటీన్లు..
హంగ్ పెరుగు ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది కణజాల నిర్మాణానికి, మరమ్మత్తు చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. ఫిట్‌నెస్ గా ఉండటానికి ప్రయత్నిస్తున్నవారు బరువును మెయింటైన్ చేయడానికి ఇది అనువైనది.
ఇది కూడా చదవండి: పరీక్షల కాలమిది.. పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
గట్ కు మంచిది..
వడగట్టిన పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియకు, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంది.
కాల్షియం..
వడగట్టిన పెరుగులో కాల్షియం మెండుగా ఉంటుంది. బలమైన ఎముకలు, దంతాల నిర్వహణకు ఇది ముఖ్యమైనది. రెగ్యులర్ దీన్ని తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎముకల బలాన్ని పెంచుతుంది.
చర్మ ఆరోగ్యం..
వడగట్టిన పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ రెండూ ఆరోగ్యకరమైన చర్మానికి సహకరిస్తాయి. ప్రోబయోటిక్స్ మోటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ చర్మ కణాల మరమ్మత్తు, పునరుత్పత్తికి సపోర్ట్ ఇస్తంది.
ఇది కూడా చదవండి: జీవితంలో సక్సెస్ కావాలంటే చెయ్యాల్సిన 10 పనులివీ..!
ఇన్ఫ్లమేషన్ గుణాలు..
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వడగట్టిన పెరుగులో సమృద్దిగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపులు, దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ లేదా తాపజనక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టైతే ఆహారంలో వడగట్టిన పెరుగును చేర్చుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.
తక్కువ కేలరీలు..
సాధారణ పెరుగుతో పోలిస్తే వడగట్టన పెరుగులో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైరీ పదార్థాలు తీసుకుంటూ కేలరీలు తక్కువగా తీసుకోవాలని అనుకునేవారికి ఈ పెరుగు బెస్ట్ ఎంపిక.
లాక్టోస్..
కొందరిలో లాక్టోస్ అసహనం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు వడగట్టిన పెరుగు నిజంగా వరమే.. వడకట్టే ప్రక్రియ లాక్టోస్‌ను గణనీయంగా తగ్గిస్తుంది, సాధారణంగా పాలు, పెరుగు అంటే పడని వారికి ఇది సులభంగా జీర్ణమవుతుంది.
ఇది కూడా చదవండి: Lemon Grass Tea: లెమన్ టీ కాదు.. లెమన్ గ్రాస్ టీ ఎప్పుడైనా తాగారా? ఉదయాన్నే ఈ టీని తాగితే జరిగేదిదే..!
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.