Share News

Lemon Grass Tea: లెమన్ టీ కాదు.. లెమన్ గ్రాస్ టీ ఎప్పుడైనా తాగారా? ఉదయాన్నే ఈ టీని తాగితే జరిగేదిదే..!

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:08 PM

చూడ్డానికి అచ్చం గడ్డిలా ఉండే ఈ నిమ్మగడ్డి ఒక అద్భుతం. దీంతో టీ చేసుకుని తాగితే జరిగేదిదే..

Lemon Grass Tea: లెమన్ టీ కాదు.. లెమన్ గ్రాస్ టీ ఎప్పుడైనా తాగారా? ఉదయాన్నే ఈ టీని తాగితే జరిగేదిదే..!

చాలామంది ఆరోగ్యం మీద స్పృహతో కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ, లెమన్ టీ, చమోమిలే టీ వంటివి తాగుతుంటారు. వీటి వల్ల ఒకవైపు శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది. కానీ చాలామందికి లెమన్ గ్రాస్ టీ గురించి తెలియదు. లెమన్ గ్రాస్ టీ ని నిమ్మగడ్డితో తయారుచేస్తారు. నిమ్మ గడ్డి మొక్క అచ్చం గడ్డిలా పెరుగుతుంది. కానీ ఈ గడ్డి మాత్రం నిమ్మకాయ వాసనను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని నిమ్మ గడ్డి అని పిలుస్తారు. నిమ్మగడ్డితో తయారుచేసే లెమన్ గ్రాస్ టీని కాఫీ, టీలకు బదులుగా ఉదయాన్నే తీసుకుంటే షాకింగ్ ఫలితాలుంటాయి. అసలు లెమన్ గ్రాస్ టీ ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

లెమన్ గ్రాస్ టీ..(Lemon grass Tea)

నిమ్మగడ్డితో టీ చేసుకోవడం చాలా సులువు. రెండు కప్పుల నీళ్లను ఒక గిన్నెలో పోసి స్టౌమీద పెట్టి వేడి చేయాలి. ఇందులో నిమ్మగడ్డిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి సుమారుు 5నిమిషాలు ఉడికించాలి. వేడి తగ్గిన తరువాత దీంట్లో కాసింత తేనె, కావలసివస్తే కొద్దిగా నిమ్మరసం కూడా జోడించుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఇది కూడా చదవండి: పరీక్షల కాలమిది.. పిల్లలలో ఒత్తిడి ఉండకూదంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


లెమన్ గ్రాస్ టీ ఆరోగ్యప్రయోజనాలు..(Lemon grass tea health benefits)

లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలన్నీ మంత్రించినట్టు తగ్గుతాయి.

లెమన్ గ్రాస్ లో సిట్రల్, జెరేనియం అనే రెండు యాంటీ ఇన్ప్లమేటరీ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నిమ్మగడ్డి సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ టీని తీసుకుంటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది.

ఇది కూడా చదవండి: జీవితంలో సక్సెస్ కావాలంటే చెయ్యాల్సిన 10 పనులివీ..!


లెమన్ గ్రాస్ లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలు బోలెడు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

చాలామంది సహాజ యాంటీ ఏజింగ్ పదార్థాలకోసం తెగ వెతుకుతుంటారు. నిమ్మ గడ్డి కూడా బెస్ట్ యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే చర్మ సమస్యలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా ఉంటుంది.

నిమ్మ గడ్డి మంచి సువాసన కారణంగా నోటి దుర్వాసన తొలగిస్తుంది. స్ట్రెఫోకోకస్ మ్యూటాన్స్ అని పిలువబడే అనే బ్యాక్టీరియా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ ఈ దుర్వాసనను తొలగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఓ మై గాడ్.. లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే.. జరిగేదిదే..!

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 03 , 2024 | 12:08 PM