Share News

Health Tips: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను తినాలా వద్దా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:50 PM

సాధారణంగా డయాబెటిక్ రోగులు తీపి పదార్థాలను నివారించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. మధుమేహ రోగులు తినకూడదని చెప్పే పండ్లలో మామిడి కూడా ఉంటుంది. కానీ

Health Tips: మధుమేహం ఉన్నవారు  మామిడి పండ్లను తినాలా వద్దా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఇది అందరికీ ఇష్టమైన పండు. వేసవిలో మామిడి పండ్లు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయా అని ఎదురుచూసేవారు ఉంటారు. అయితే ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని, మధుమేహరోగులు అస్సలు తినకూడదని అంటూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా మందికి అవగాహన కూడా ఉండదు. సాధారణంగా డయాబెటిక్ రోగులు తీపి పదార్థాలను నివారించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. మధుమేహ రోగులు తినకూడదని చెప్పే పండ్లలో మామిడి కూడా ఉంటుంది. కానీ మామిడి పండును నిజంగానే మధుమేహ రోగులు తినకూడదా? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు తెలుసుకుంటే..

మామిడి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీచు, విటమిన్లు, మినరల్స్ మామిడిలో ఉంటాయి. అలాగే చక్కెర స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్స్ స్థాయి తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉన్న మధుమేహ రోగులు మామిడి పండ్లను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Epsom Salt: ఎప్సమ్ సాల్ట్ గురించి ఈ విషయం తెలుసా? దీన్ని నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే..!



డయాబెటిక్ పేషెంట్‌లు ఆహారంలో మామిడిని చేర్చుకునేటప్పుడు ఎంత మామిడిపండు తినాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తరిగిన మామిడికాయను సగం నుండి ఒక కప్పు వరకు తింటే ఫర్వాలేదు. కానీ రక్తంలో చక్కెర స్థాయిని కూడా తనిఖీ చేసుకోవాలి. తద్వారా మామిడి తినడం వల్ల రక్తంలో చక్కెరపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవచ్చు. మామిడిని ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వుతో కలిపి తీసుకుంటే చక్కెర శోషణ మందగించడం ద్వారా రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది.

మామిడిలో పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో కూడా మామిడి సహాయపడుతుంది. దీన్ని సరైన పరిమాణంలో తింటే చాలా జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది, అయితే మధుమేహంతో బాధపడేవారు మామిడిని తక్కువ పరిమాణంలో తిసుకోవచ్చట.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) అంటే షుగర్ లెవెల్ 51 ఉంటుంది. అందుకే దీన్ని తినవచ్చు. పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల పండ్ల తీపి ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కాల్షియం, విటమిన్ ఎ, కె, బి6, బి12 వంటి అనేక పోషకాలు మామిడిలో ఉన్నాయి. మధుమేహ రోగులు అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో పరిమిత పరిమాణంలో మామిడిని తినవచ్చు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. బంగాళాదుంపలు, ధాన్యాలు, వేయించిన వంటి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలు మామిడితో తినకుండా ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఇంతే కాదు తాజా మామిడి జ్యూస్, కృత్రిమ జ్యూస్ లు నివారించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 23 , 2024 | 01:50 PM