Share News

Health Tips: పదే పదే అనారోగ్యం వేధిస్తోందా? ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి.. షాకవుతారు..!

ABN , Publish Date - May 25 , 2024 | 05:21 PM

వైద్యుల నుండి పెద్దల వరకు అనారోగ్యం చేసినప్పుడు తేలికగా ఉన్న ఆహారాలను, ముఖ్యంగా ద్రవాహారాలను బాగా తీసుకోమని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. పదే పదే అనారోగ్యం వేధిస్తుంటే దానికి ఈ ఒక్క జ్యూస్ భలే పనిచేస్తుంది.

Health Tips: పదే పదే అనారోగ్యం వేధిస్తోందా? ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి.. షాకవుతారు..!

అనారోగ్యం ఇప్పట్లో చాలా సాధారణ విషయం. అయితే అనారోగ్యం చేసినప్పుడు జీర్ణవ్యవస్థ కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే వైద్యుల నుండి పెద్దల వరకు అనారోగ్యం చేసినప్పుడు తేలికగా ఉన్న ఆహారాలను, ముఖ్యంగా ద్రవాహారాలను బాగా తీసుకోమని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. పదే పదే అనారోగ్యం వేధిస్తుంటే దానికి సొరకాయ చక్కని ఔషదంగా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

వేడి నుండి ఉపశమనం పొందడానికి సొరకాయ రసం మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు శరీరాన్ని చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే గ్లాసుడు సొరకాయ జ్యూస్ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!


కొందరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పదే పదే అనారోగ్యాల బారిన పడుతుంటారు. అయితే సొరకాయ జ్యూస్ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంతో పాటు శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్లను తొలగించి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సొరకాయ జ్యూస్ లో క్యాలరీలు (తక్కువ క్యాలరీల వెజిటబుల్ జ్యూస్) తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గాలనే అలోచన ఉన్నవారికి, బరువు పెరుగుతున్నాం అనిపించిన వారికి ఇది చాలా సహాయపడుతుంది. సొరకాయ జ్యూస్ తాగుతూ ఉంటే బరువు వేగంగా తగ్గుతారు. సొరకాయలో పుష్కలంగా పీచు ఉంటుంది. దీని కారణంగా అతిగా తినడం నివారించవచ్చు. ఈ రసంలో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


సొరకాయ జ్యూస్ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ జ్యూస్ తీసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ సమస్యను సులువుగా పరిష్కరిస్తుంది. చర్మానికి, జుట్టుకు మెరుపును ఇస్తుంది.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 25 , 2024 | 05:21 PM