Share News

Hair fall: జాగ్రత్త ఈ 8 ఆహారపు అలవాట్లు జుట్టు రాలే సమస్యను పెంచుతాయ్!

ABN , Publish Date - Jan 26 , 2024 | 03:48 PM

ఈ 8 ఆహారపు అలవాట్లే జుట్టు రాలే సమస్యను అమాంతం పెంచుతున్నాయ్.

Hair fall: జాగ్రత్త ఈ 8 ఆహారపు అలవాట్లు జుట్టు రాలే సమస్యను పెంచుతాయ్!

ఆహారమే ఆరోగ్యమని అంటారు. తీసుకునే ఆహారం మీదనే మొత్తం శరీర ఆరోగ్యం ఎలా ఉంటుందనే విషయం ఆధారపడి ఉంటుంది. చర్మం యవ్వనంగా ఉండాలన్నా, జుట్టు పెరుగుదల బాగుండాలన్నా, శరీరం ఫిట్ గా ఉండాలన్నా, కంటి చూపు బాగుండాలన్నా..ఇలా ప్రతి విషయానికి తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పట్లో చిన్న, పెద్ద తేడా లేకుండా జుట్టు రాలడమనే సమస్యతో ఇబ్బంది పడుుతున్నారు. దీనికి జీవనశైలి, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణమవుతాయని జుట్టు సంరక్షణ నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ 8 ఆహారపు అలవాట్లు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయని చెబుతున్నారు. జుట్టురాలే సమస్యను అమాంతం పెంచే ఆ 8 ఆహారాలేంటో తెలుసుకుని వాటిని నివారించడం ఎంతైనా ముఖ్యం.

విటమిన్-ఎ..

అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలన్నారు. విటమిన్-ఎ కంటికి, జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరమైనదే అయినా విటమిన్-ఎ శరీరంలోకి అతిగా వెళితే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్..

వేయించిన, ఆయిల్ ఫుడ్స్ లో ఉండే కొవ్వులకు.. డైహైడ్రోటెస్టోస్టెరాన్, టెస్టోస్టెరాన్ స్థాయిలకు మధ్య లింక్ ఉంటుంది. ఇది బట్టతలకు కారణమయ్యే హార్మోన్. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం శరీరంలో ఆక్సికరణ ఒత్తిడి పెంచుతుంది. ఇవన్నీ జుట్టు రాలే సమస్యను పెంచుతాయి.

ఇది కూడా చదవండి: బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!


అధిక పాదరసం కలిగిన ఆహారాలు..

మాకేరెల్, సుషీ, స్వోర్డ్ ఫిష్, ట్యూనా వంటి చేపలలో పాదరసం ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువ తింటే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

తక్కువ ప్రోటీన్..

ప్రోటీన్లలో జుట్టు పెరుగుదలకు అవసరమైన అమైనో అమ్లాలు ఉంటాయి. హెయిర్ ఫోలికల్స్ సరిగ్గా పెరగడానికి ఇవి కారణం అవుతాయి. ప్రోటీన్ లోపిస్తే జుట్టు పెరుగుదల లేకపోగా జుట్టు రాలిపోతుంది.

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు..

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు శరీరంలో చక్కెరలుగా విరిగిపోతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజన్ స్థాయిలు పెంచుతుంది. జుట్టు రాలే సమస్యను పెంచుతుంది.

ఇది కూడా చదవండి: Foot Shape: పాదాల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పేయచ్చా? పర్సనాలిటీ టెస్ట్ ఏం చెబుతోందంటే..!



ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు..

ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలు కూడా శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరగడానికి కారణం అవుతుంది. జుట్టు కుదుళ్లను బలహీన పరిచి రాలిపోవడానికి దారితీస్తుంది.

జింక్, ఐరన్ లోపం..

జింక్, ఐరన్ జుట్టు ఆరోగ్యానికి, కెరాటిన్ పెరుగుదలకు అవసరం. ఇది లోపిస్తే కెరాటిన్ పెరుగుదల తగ్గి జుట్టు తెల్లబడటం, రాలిపోవడం జరుగుతుంది.

కాల్షియం లోపం..

కాల్షియం లోపం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది.

ఇది కూడా చదవండి: Anti-aging: 40ఏళ్ళు దాటినా యవ్వనంగా కనిపించాలనుందా? ఈ 4 టిప్స్ ట్రై చేసి చూడండి!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 04:25 PM