Share News

Anti-aging: 40ఏళ్ళు దాటినా యవ్వనంగా కనిపించాలనుందా? ఈ 4 టిప్స్ ట్రై చేసి చూడండి!

ABN , Publish Date - Jan 26 , 2024 | 12:22 PM

కాలం గడిచేకొద్దీ యవ్వనం తగ్గి మెల్లిగా వృద్దాప్యం పెరుగుతుంది. కానీ ఈ టిప్స్ పాటిస్తే 40 ఏళ్లు దాటినా యవ్వనంగా ఉంటారు.

Anti-aging: 40ఏళ్ళు దాటినా యవ్వనంగా కనిపించాలనుందా? ఈ 4 టిప్స్ ట్రై చేసి చూడండి!

మనిషి జీవితంలో యవ్వనం చాలా గొప్ప దశ. ఈ దశలోనే సక్సెస్, సంతోషం, స్వేచ్చ అన్నీ ఉంటాయి. అన్నికంటే ముఖ్యంగా అందంగా కనిపించే గొప్ప దశ ఇదే.. అయితే కాలం గడిచేకొద్దీ యవ్వనం తగ్గి మెల్లిగా వృద్దాప్యం పెరుగుతుంది. ముఖంలో కాంతి తగ్గడం, చర్మం మీద ముడుతలు, గీతలు ఏర్పడటం మొదలవుతుంది. ముడుతలు, మచ్చలు తగ్గించుకుని అందంగా కనిపించడానికి చాలామంది మార్కెట్లో దొరికే చాలా ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే 40 ఏళ్ళు దాటినా సరే.. యవ్వనంగా కనిపిస్తారు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

ఫేషియల్..

40ఏళ్ళు దాటినా యవ్వనంగా ఉండాలంటే ఫేషియల్ చాలాబాగా సహాయపడుతుంది. 15రోజులకు ఒకసారి ముఖానికి ఫేషియల్ చేసుకుంటూ ఉంటే ముఖం మీద ముడతలు, మచ్చలు, ట్యాన్ అంతా తొలగిపోయి ముఖ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. దీన్ని బయట బ్యూటీ పార్లర్ లోనే కాదు ఇంటి వద్దనే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఫేషియల్ ట్రై చేయవచ్చు.

ఇది కూడా చదవండి: బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!


రోజ్ వాటర్

రోజ్ వాటర్ చాలామంది సులువుగా ఉపయోగించగల ద్రావణం. ప్రతిరోజూ రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే ముఖం మీద అదనపు నూనె, మొటిమలు, మృతకణాలు మొదలనైవి మెల్లిగా తగ్గుతాయి. కేవలం రోజ్ వాటర్ మాత్రమే కాకుండా పచ్చిపాలు, నారింజ రసం, బొప్పాయి గుజ్జు వంటి సహజ పదార్థాలను కూడా ముఖానికి ఉపయోగించవచ్చు.

డార్క్ సర్కిల్స్..

చాలామంది అందంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలు మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఈ నల్లని వలయాలు తొలగించుకోవడానికి బ్యూటీ క్రీములు, బ్యూటీ టిప్స తో పాటూ జీవనశైలి కూడా చాలా సహాయపడుతుంది. రాత్రి తొందరగా నిద్రపోవడం, అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండటం, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం, కళ్ల మీద పాలలో ముంచిన కాటన్ ప్యాడ్స్ లేదా వాడేసిన టీ బ్యాగ్స్, కీరా చక్రాలు మొదలైనవి ఉంచుకోవడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి: అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!

హైడ్రేటెడ్ గా ఉండాలి..

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. రోజూ తగినంత నీరు తాగుతూ ఉంటే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్-ఎ, విటమిన్-ఇ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉన్నా చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 12:22 PM