అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!

అల్పాహారంలో ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్న ఈ ఆహారాలు తీసుకుంటే రోజంతా మంచి ఎనర్జీతో ఉండవచ్చు.

ఆల్మండ్ బటర్..

దీన్నే బాదం వెన్న అంటారు.  ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తృణధాన్యాల బ్రెడ్ లేదా గోధుమ బ్రెడ్ లేదా ఓట్మీట్ తో దీన్ని తీసుకుంటే రోజంతా సూపర్ ఎనర్జీ సొంతం.

పీనట్ బటర్..

వేరుశనగ వెన్న ప్రోటీన్ కు పవర్ హౌస్. చక్కరలేని వేరుశనగ వెన్నను  ఉదయాన్నే స్మూతీస్, తృణధాన్యాల బ్రెడ్ తో కలిపి తీసుకోవచ్చు.

గ్రీక్ యోగర్ట్..

గ్రీకు పెరుగులో చిటికెడు  ఉప్పు, వెల్లుల్లి, పుదీన, కొత్తిమీర వంటివి మిక్స్ చేయడం ద్వారా మరింత రుచిగా ఉంటుంది. దీన్ని గోధుమ బ్రెడ్ టాప్ గానూ, కూరగాయలతో మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు.

హమ్మస్..

హమ్మస్ అనేది శనగల నుండి తయారయ్యే పదార్థం. ఇది ప్లాంట్ బేస్డ్ సూపర్ ఫుడ్. దీన్ని రొట్టెలు, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. శాండ్విచ్ లోనూ ఉపయోగించవచ్చు.

జీడిపప్పు చీజ్..

పాల చీజ్ కు బదులుగా జీడిపప్పును నానబెట్టి ఈస్ట్, వెల్లుల్లి, నిమ్మరసం సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసి జీడిపప్పు చీజ్ తయారుచేస్తారు. ఇది టోస్ట్, శాండ్విచ్ లలోకి బాగుంటుంది.

కాటేజ్ చీజ్, హెర్బ్ బ్లెండ్

మెంతి, పార్స్లీ, పుదీనా, కొత్తిమీర వంటి ఆకులను కాటేజ్ చీజ్ తో మిక్స్ చేసి తృణధాన్యాల బ్రెడ్ లేదా రొట్టెలు, శాండ్విచ్ లతో కలిపి తీసుకోవచ్చు.

పొద్దుతిరుగుడు వెన్న..

వేరుశనగ, బాదం లాగా పొద్దుతిరుగుడు విత్తనాలతో కూడా వెన్న తయారుచేస్తారు. దీన్ని కూడా తృణధ్యానాల బ్రెడ్,  స్మూతీస్ లో వాడొచ్చు.