Share News

Coffee Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఓ కప్పు కాఫీ లాగించేయండి మరి.. ఎందుకంటే..

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:43 PM

అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి కాఫీ. చాలా మంది ప్రజలు తమ రోజును వేడి వేడి కాఫీతో ప్రారంభించడాన్ని ఇష్టపడుతుంటారు. అద్భుతమైన రుచి, సువాసన కలిగి ఉండే కాఫీ.. బరువు తగ్గించడంలో సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా..

Coffee Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఓ కప్పు కాఫీ లాగించేయండి మరి.. ఎందుకంటే..

అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి కాఫీ. చాలా మంది ప్రజలు తమ రోజును వేడి వేడి కాఫీతో ప్రారంభించడాన్ని ఇష్టపడుతుంటారు. అద్భుతమైన రుచి, సువాసన కలిగి ఉండే కాఫీ.. బరువు తగ్గించడంలో సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా.. ఇందులో కొవ్వులను బర్న్ చేసే హెల్తీ ఎంజైమ్స్ ద్వారా.. బరువు పెరగకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాఫీ అనేది.. కొవ్వు, చక్కెర లేదా కార్బోహైడ్రేట్ గ్రాములు లేని క్యాలరీ-రహిత పానీయం. జీవక్రియపై ప్రభావం చూపడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాఫీ వినియోగం.. ఆకలిని తగ్గిస్తుంది. దీని ఫలితంగా బరువు తగ్గుతుంది. పని చేయడానికి ఒక గంట ముందు కాఫీ తీసుకోవడం ద్వారా డోపమైన్ విడుదల అవుతుంది. ఇది కేలరీల వ్యయాన్ని పెంచుతుంది.


Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..

కాఫీలో మాంగనీస్, పొటాషియం, విటమిన్లు B2, B5, B3 వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి లివర్ క్యాన్సర్‌తో పాటు, పార్కిన్సన్స్, టైప్ 2 మధుమేహం, కాలేయ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సాధారణంగా కాఫీలో చక్కెర, క్రీమ్, సిరప్ వంటి పదార్థాలను యాడ్ చేస్తుంటారు. అలా కాకుండా కేవలం బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. ప్రతిరోజూ 2-3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోవడం ద్వారా గుండె సమస్యలకు దారి తీస్తుంది. హైపర్‌టెన్షన్ బాధితులు దానికి దూరంగా ఉండాలి. కెఫీన్ గర్భాశయ రక్త నాళాలు సంకోచించటానికి కారణమవుతుంది. కాబట్టి గర్భిణీలు పరిమితంగానే కాఫీ తీసుకోవడం ఉత్తమం.


AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..

400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ రోజువారీ కెఫిన్ తీసుకోవడం చికాకు కలిగించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి శరీరం కాఫీకి ఎలా స్పందిస్తుందనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. కెఫిన్-ప్రేరిత అడ్రినలిన్ ఆందోళనకు కారణమవుతుంది. దానిని నివారించడానికి కాఫీ తీసుకోవడం తగ్గించాలి. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలి. మెగ్నీషియం, కాల్షియం లోపాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయలు వంటి ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 07:46 PM