Share News

Cucumber Side Effects: అరోగ్యానికి మంచిది కదా అని కీర దోస బాగా తినేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:33 AM

సాధారణ రోజుల్లో కంటే వేసవి కాలంలో కీరదోస తినడానికి చాలా ఇష్టపడతారు. ఇందులో 90శాతం పైన నీటి కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా కీరదోస కాయను ఎక్కువగా తింటే మాత్రం.

Cucumber Side Effects: అరోగ్యానికి మంచిది కదా అని కీర దోస బాగా తినేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!

కీరదోస.. రుచిగా, ఆహ్లాదంగా, రిఫ్రెషింగ్ అనభూతిని ఇస్తుంది. దోసకాయలో విటమిన్ సి, కె, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కంటే వేసవి కాలంలో కీరదోస తినడానికి చాలా ఇష్టపడతారు. ఇందులో 90శాతం పైన నీటి కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా కీరదోస కాయను ఎక్కువగా తింటే మాత్రం నష్టాలు కూడా ఉంటాయంటున్నారు ఆరగ్య నిపుణులు. కీరదోసకాయ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో తెలుసుకుంటే..

హైపర్కలేమియా..

దోసకాయలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల హైపర్‌కలేమియా వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు మాత్రమే కాకుండా గ్యాస్, ఎసిడిటీ, వాపు, తిమ్మిరికి కూడా కారణమయ్యే సమస్య.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


నిర్జలీకరణము..

నీరు అధికంగా ఉండే దోసకాయ శరీరాన్ని డీహైడ్రేట్ కూడా చేస్తుంది. దోసకాయలో ఉండే గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిలో కుకుర్బిటిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది.

మలబద్ధకం..

దోసకాయ లేకుండా ఆహారం తినలేని వారు కొందరుంటారు. అలాగే రాత్రి పూట కూడా దోసకాయ తినేవారుంటారు. ఇలాంటి వారు మలబద్ధకం బారిన పడవచ్చు. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణం కాదు.

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!



సైనస్ సమస్యలు..

దోసకాయ చల్లదనాన్ని కలిగి ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కఫంతో బాధపడుతుంటే, దోసకాయ అధికంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది పై సమస్యలను పెంచుతుంది.

గర్భిణీ స్త్రీలకు..

దోసకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా సమస్యలు వస్తాయి. ఇందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా మూత్ర విసర్జన సమస్య రావచ్చు. అంతేకాకుండా ఇది అజీర్ణాన్ని కూడా పెంచుతుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.

Keratin at Home: మిగిలిపోయిన అన్నంతో ఇలా చేశారంటే చాలు.. సెలూన్ స్టైల్ హెయిర్ మీ సొంతం..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 23 , 2024 | 11:33 AM