Share News

Citrus Fruits: భోజనం తరువాత నిమ్మజాతి పండ్లు తినడం ఆరోగ్యమేనా? వైద్యులు బయటపెట్టిన నిజాలివీ..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 04:41 PM

నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. భోజనం తరువాత వీటిని తినడం మంచిదేనా అనే ప్రశ్నకు వైద్యులు, ఆహారనిపుణులు బయటపెట్టిన నిజాలివీ..

Citrus Fruits: భోజనం తరువాత నిమ్మజాతి పండ్లు తినడం ఆరోగ్యమేనా? వైద్యులు బయటపెట్టిన నిజాలివీ..!

చాలామందికి భోజనం తరువాత కనీసం ఓ పండు తినడం అలవాటుగా ఉంటుంది. చాలా ఫంక్షన్లలోనూ, శుభకార్యాలలోనూ భోజనం తరువాత తినడానికి ఐస్ క్రీమ్, ఫ్రూట్ బౌల్ కూడా ఏర్పాటుచేసి ఉంటారు. ఎక్కువ మంది భోజనం తరువాత అరటిపండు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే కొందరు నిమ్మజాతి పండ్లైన బత్తాయి, ఆరెంజ్ వంటి పండ్లు కూడా తింటూంటారు. నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. భోజనం తరువాత వీటిని తినడం మంచిదేనా అనే ప్రశ్నకు వైద్యులు, ఆహారనిపుణులు బయటపెట్టిన నిజాలేంటో తెలుసుకుంటే..

జీర్ణక్రియలో అసౌకర్యం..

సిట్రస్ పండ్లలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇవి జీర్ణక్రియలో అంతరాయం కలిగిస్తాయి. అజీర్ణం, ఆమ్లత్వం, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తాయి.

ఇది కూడా చదవండి: బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!


చక్కెర జోడించినట్టే..

సిట్రస్ పండ్లలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. భోజనం చేసిన వెంటనే వీటిని తినడం వల్ల శరీరంలోకి వెళ్లే చక్కెరల శాతం ఎక్కువ అవుతుంది. మధుమేహం వంటి ఆరోగ్య సమస్యల ముప్పు ఉన్నవారికి భోజనం తరువాత ఈ పండ్లు తీసుకోవడం సమస్య పెంచుతుంది.

జీర్ణకోశ అసౌకర్యం..

భోజనం చేసిన వెంటనే సిట్రస్ పండ్లను తినడం వల్ల కొంతమందికి కడుపులో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి ఏర్పడుతుంది. జీర్ణాశయం సున్నితంగా ఉన్నవారికి ఈ పండ్లు సమస్యలు పెంచుతాయి.

పోషకాల శోషణకు ఆటంకం..

సిట్రస్ పండ్ల ఆమ్లత్వం కొన్ని పోషకాలను, ముఖ్యంగా ఐరన్ గ్రహించకుండా నిరోధించే అవకాశం ఉంది. విటమిన్లు, ఖనిజాలపై సిట్రస్ పండ్లు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. పాలీఫెనాల్స్, ఆక్సలేట్లు వంటి కొన్ని సమ్మేళనాలు శరీరం పోషకాలను గ్రహించకుండా చేసే అవకాశం ఉంది.

యాసిడ్ రిఫ్లక్స్..

సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా భోజనం చేసిన వెంటనే తింటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు గురయ్యే అవకాశం ఉంది. కడుపు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ యాసిడ్లు చాలా అసౌకర్యం కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి: రోజూ వేరుశనగలు తింటే.. వెయ్యి ఏనుగుల బలం!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 04:41 PM