రోజూ వేరుశనగలు తింటే.. వెయ్యి ఏనుగుల బలం!

వేరుశనగలలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు  ఉంటాయి. ఇవన్నీ శరీరానికి పోషణనిస్తాయి.

వేరుశనగలలో ఉండే కొవ్వులు, ప్రోటీన్లు, కార్భోహైడ్రేట్లు శరీరానికి అమితమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉండటం మూలాన  గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడుకొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

వేరునగలో ఫైబర్,ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా బరువు మేనేజ్ చేయడంలో సహాయపడతాయి.

వేరుశనగలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.   చలికాలంలో చాలామంచిది.

విటమిన్-ఇ తో సహా చాలా విటమిన్లు, ఖనిజాలు వేరుశనగలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వేరుశనగలో ఉండే విటమిన్-ఇ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చలికాలంలో చర్మం పొడిగా, చికాకుగా ఉండటాన్ని నివారిస్తుంది.