బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!

ఎలాన్ మస్క్..

ఎలాన్ మస్క్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్/సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో విద్యను అభ్యసించాడు. 24ఏళ్ళ వయసులో పిహెచ్డి లో చేరి రెండురోజుల తరువాత తప్పుకున్నాడు.  మస్క్ నికర విలువ 199బిలియన్ డాలర్లు.

జెఫ్ బెజోస్..

బెజోస్ ప్రిన్స్టన్  యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఈయన నికర విలువ 184బిలియన్ డాలర్లు.

బెర్నాల్డ్ ఆర్నాల్ట్..

పారిస్ లోని ఎకోల్ పాలిటెక్నిక్ లో ఇంజనీరింగ్ చేశాడు. ఈయన నికర విలువ 183బిలియన్ డాలర్లు.

బిల్ గేట్స్..

బిల్ గేట్స్ అండర్ గ్రాడ్యుయేషన్  అసలు పూర్తీ చేయలేదు. మైక్రోసాఫ్ట్ ప్రారంభించడానికి  మూడు సెమిస్టర్ల తరువాత హార్వర్డ్ యూనివర్సిటీ నుండి తప్పుకున్నాడు.  నికర విలువ 144 బిలియన్ డాలర్లు.

మార్క్ జుకర్బర్గ్..

మార్క్ కూడా హార్వర్డ్ యూనివర్సిటీ లో చదువు మానేశాడు. ఈయన ఆస్తుల విలువ 142బిలియన్ డాలర్లు.

స్టీవ్ బాల్మెర్..

1977లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి గణితం, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించాడు. తరువాత స్టాన్ పోర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో చేరాడు కానీ ఏడాది కంటే ఎక్కువ ఉండలేక మానేశాడు. నికర విలువ 140బిలియన్ డాలర్లు.

లారీ పేజీ..

1995లో మిచిగాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో  బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 1998లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ సాధించారు. ఈయన నికర విలువ  137బిలియన్ డాలర్లు.

సెర్గీ బ్రిన్..

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్డ్స్/ సైన్స్  పూర్తీ చేశారు. నికర విలువ 129బిలియన్ డాలర్లు.

వారెన్ బఫెట్..

1949లో నెబ్రాస్కా యూనివర్సిటీ నుండి పట్టా పొందారు. బెంజిమిన్ గ్రాహం ఆధ్వర్యంలో కొలంబియా బిజినెస్ స్కూల్లో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. నికర విలువ 128బిలియన్ డాలర్లు.

లారీ ఎల్లిసన్..

యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, అర్బానా ఛాంపెయిన్ లో డ్రాపవుట్ విద్యార్థి ఇతను. ఈయన నికర విలువ 128బిలియన్ డాలర్లు.