Share News

Almonds: రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:33 AM

ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో చాలా మందికి తెలియదు.

Almonds:  రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభాలంటే..!

బాదం పప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ రాత్రి బాదం పప్పు నానబెట్టి ఉదయాన్నే వాటి మీద పొట్టు తీసుకుని తినడం చాలామందికి అలవాటు. అయితే ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో చాలా మందికి తెలియదు. కొందరు అతిగా తింటారు, మరికొందరు చాలా తక్కువ తింటారు. కానీ బాదం పప్పు వల్ల ఆరోగ్యానికి మెరుగైన లాభాలు కలగాలంటే రోజూ ఎన్ని బాదం తినాలో.. దాని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

బాదం పప్పులో పోషకాలు సమృద్దిగా ఉండటం వల్ల ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే రోజూ 30గ్రాముల బాదంపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయట.

ఇది కూాడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!


బాదం పప్పులను లెక్క పెట్టుకుని తినాలంటే ప్రతిరోజూ 7,8 వరకు నానబెట్టినవి తీసుకోవచ్చు. 7,8 బాదం పప్పుల నుండి 6గ్రాముల ప్రోటీన్, 12గ్రాముల కొవ్వు, 15గ్రాముల కార్బోహైడ్రేట్స్ శరీరానికి లభిస్తాయి. ఇక కేలరీల విషయానికి వస్తే 7,8 బాదం పప్పులు తీసుకోవడం వల్ల 300కేలరీలు అందుతాయి.

బాదంలో విటమిన్-బి6, విటమిన్-ఇ, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరం. బాదం పప్పులను చలికాలంలో తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అయితే బాదం పప్పును 7,8 కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Coriander: వంటల్లో అలంకరణకే కాదండోయ్.. కొత్తిమీరను ఇలా వాడితే ఎన్ని లాభాలంటే,,!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 11:33 AM