Share News

BRS: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ

ABN , Publish Date - May 07 , 2024 | 09:20 AM

వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ రాజుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుకోసం అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కలిసి పంచుకున్నారు. పర్సెంటేజీలుగా పంచుకున్నట్టు సమాచారం. బూత్ కమిటీలు, మండలస్థాయి కేడర్‌కు ఫండ్ అందక పోవడంతో నిరాశలో ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలపై సొంతపార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

BRS: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ

వరంగల్: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ రాజుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుకోసం అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్‌ను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కలిసి పంచుకున్నారు. పర్సెంటేజీలుగా పంచుకున్నట్టు సమాచారం. బూత్ కమిటీలు, మండలస్థాయి కేడర్‌కు ఫండ్ అందక పోవడంతో నిరాశలో ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలపై సొంతపార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రచారంలో బీఆర్ఎస్ వెనుకబడింది. అసలే మూలిగే నక్క మాదిరిగా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. ఈ పార్టీ ఫండ్‌ను కీలక నేతలు పంచుకోవడంతో ఆ పార్టీ నెత్తిన తాటిపండు పడినట్టుగా తయారైంది.

Lok Sabha Polls 2024: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. పోటీలో కీలక నేతలు


అసలే ఎన్నికల ప్రచారానికి ఇవాళ, రేపు డబ్బిస్తేనే రావడం కష్టంగా ఉంది. అలాంటిది డబ్బు మొత్తం తినేసి రిక్త హస్తాలు చూపిస్తే.. జనాలు మొత్తం హస్త గుర్తు వైపు టర్న్ అవుతారు. ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి తరుణంలో ఆదుకోవాల్సిన.. అండగా ఉండాల్సిన నేతలే ఇలా డబ్బు పంచుకుంటూ పార్టీని మరింత పాతాళానికి తొక్కేయడమేంటని కేడర్ ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలల ముందు వరకూ ఓ వెలుగు వెలిగిన ఉద్యమ పార్టీ ఏ స్థితికి చేరిందని అంతా నివ్వెరబోతున్నారు.

ఇవి కూడా చదవండి..

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

Read Latest Telangaa News and Telugu News

Updated Date - May 07 , 2024 | 09:20 AM