Share News

Chandrababu: చంద్రబాబు కింగ్‌ మేకర్‌!

ABN , Publish Date - Jun 06 , 2024 | 08:51 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై తమిళ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ విశేషాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ప్రచార సమయంలో ఓ వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న దృశ్యాలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి.

Chandrababu: చంద్రబాబు కింగ్‌ మేకర్‌!
Chandrababu Naidu

‘మోదీ సర్కారు ఏర్పాటులో చంద్రబాబు, నితీశ్‌ కీలకమంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెబ్‌ ఎడిషన్‌లో ప్రచురితమైన వార్త

చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై తమిళ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ విశేషాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం సాయంత్రం వరకు టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ప్రచార సమయంలో ఓ వేదికపై ప్రధాని మోదీ చంద్రబాబు చేతులు పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న దృశ్యాలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ‘‘కేంద్రంలో చంద్రబాబు కింగ్‌ మేకర్‌ అయ్యారు. ఆయన కోసం అటు ఎన్‌డీఏ, ఇటు ఇండియా కూటములు ఎదురు చూస్తున్నాయి’’ అంటూ పలు చానళ్లు కథనాలు ప్రసారం చేశాయి.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత చంద్రబాబు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారని పేర్కొన్నాయి. ఆంధ్రా ప్రజలు సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకున్నారని, సరైన వ్యక్తిని ఎన్నుకున్నారని ప్రశంసించాయి. చాలాకాలం తరువాత కేంద్రప్రభుత్వంలో దక్షిణాది వ్యక్తికి చక్రం తిప్పే అవకాశం వచ్చిందని, ఇది మొత్తం దక్షిణ భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నాయి. తమిళనాట సాధారణ ప్రజలూ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎంతో ఆసక్తి చూపారు.


‘మోదీ.3’ సుస్థిరతకు బాబు మద్దతే కీలకం

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన చంద్రబాబు పేరు జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ నియామకాల్లో కీలక భూమిక పోషించిన ఆయన.. వాజపేయి హయాంలోనూ ఎన్డీయే కన్వీనర్‌గా చక్రం తిప్పిన వైనాన్ని జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తోంది.

ఎన్నికల ముంగిట జనసేనతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం.. 25 లోక్‌సభ స్థానాలకు గాను 21చోట్ల కూటమి విజయం సాధించడం.. సొంతంగా టీడీపీ 16 స్థానాలు సాధించిన నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో బీజేపీ అగ్ర నేతలు ఆయనకు అధిక ప్రాధాన్యమివ్వక తప్పదని జాతీయ మీడియా అంటోం ది. బుధవారం ఢిల్లీలో మోదీ నివాసంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని.. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటు, దాని సుస్థిరతకు ఆయన కీలకమని చెబుతోంది.


సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18, రిపబ్లిక్‌ వంటి జాతీయ మీడియా సంస్థలు ఆయనపై బుధవారం ప్రత్యేక బులిటెన్లు ప్రసారం చేయడం విశేషం. కొత్త ప్రభుత్వంలో టీడీపీకి లోక్‌సభ స్పీకర్‌ పదవితో పాటు ఐదు మంత్రిపదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత 16 సీట్లతో అతిపెద్ద పార్టీ టీడీపీయే కావడంతో బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబుకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

AP Politics: కొడాలి నాని అమెరికాకు.. వెనిగండ్ల రాము షాకింగ్ కామెంట్స్

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు.. ఎందుకంటే..?

For more Election News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:10 PM