Share News

PM Modi: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: మోదీ

ABN , Publish Date - May 08 , 2024 | 11:51 AM

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

PM Modi: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: మోదీ
pm modi

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని కోరారు. ఇటీవల జరిగిన మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. ఇండియా కూటమి పని అయిపోయిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ విజయ రథయాత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల కబంధ హస్తాల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.


రిజర్వేషన్లను లాక్కొవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. ఎస్సీలలో వర్గీకరణ చేసేందుకు ఎన్డీఏ కూటమి అనుకూలంగా ఉందని గుర్తుచేశారు. మాదిగల వర్గీవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇదివరకు అదానీ, అంబానీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాట్లాడటం లేదు.. ఆ ఇద్దరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత మొత్తం నగదు తీసుకుందో చెప్పాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు.

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 12:54 PM