Share News

Loksabha Polls: బీజేపీతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్.. సీఎం రేవంత్‌పై హరీశ్ విసుర్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. అందుకే బలహీన అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు.

Loksabha Polls: బీజేపీతో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్.. సీఎం రేవంత్‌పై హరీశ్ విసుర్లు
Harish Rao

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. అందుకే బలహీన అభ్యర్థులను బరిలోకి దింపారని ఆరోపించారు. తాము ఎక్కడ విమర్శలు చేస్తామని భయపడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించరని పేర్కొన్నారు. ఆ ఓటమి భయం రేవంత్ రెడ్డికి పట్టుకుందని వివరించారు.


TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం


హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలియదా..? అని హరీశ్ రావు గుర్తుచేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేయడం సాధ్యం కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు. బీసీలను మోసం చేసింది రేవంత్ రెడ్డి అని వివరించారు. ఇప్పుడు మిగతా పార్టీలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు ఉందని ధ్వజమెత్తారు.


TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

Read Latest Telangana News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 09:40 PM