Share News

కవిత బెయిల్ మీద దృష్టి సారించండి: మంత్రి కోమటి రెడ్డి

ABN , Publish Date - Apr 23 , 2024 | 07:55 PM

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని ఆరోపించారు.

 కవిత బెయిల్ మీద దృష్టి సారించండి: మంత్రి కోమటి రెడ్డి
Komatireddy Venkat Reddy

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని ఆరోపించారు.


బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. 14 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని వివరించారు. బీజేపీ రెండు నుంచి మూడు చోట్ల విజయం సాధిస్తారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమై ప్రతిపక్షానికి పరిమితమైంది.


బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల కవిత బెయిల్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. ఈడీ తర్వాత సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.


Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 07:55 PM