Share News

TS Lok Sabha Polls: మసీదుల కోసం ఓటేయాలన్న అసద్.. రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్!

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:59 PM

పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సారి మజ్లీస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘ మీ ఓటు మజ్లీస్ కోసం కాకున్నా మసీదుల కోసం వేయండి. ఈ సారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు.

 TS Lok Sabha Polls: మసీదుల కోసం ఓటేయాలన్న అసద్.. రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్!
Asaduddin Owaisi Asked Voters Name Of Mosque

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు లోక్ సభ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ అనుకుంటున్నాయి. పాతబస్తీలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రచారం నిర్వహించారు. ఈ సారి మజ్లీస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ‘ మీ ఓటు మజ్లీస్ కోసం కాకున్నా మసీదుల కోసం వేయండి. ఈ సారి తమ పార్టీకి ఓటు వేయకుంటే ప్రార్థనా మందిరాలను లాక్కుంటారు అని సంచలన ఆరోపణలు చేశారు.

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?


Raja-Singh.jpg

పొంచి ఉన్న ముప్పు

దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొస్తారు. అలాంటి ప్రమాదం పొంచి ఉందని ఒవైసీ గుర్తుచేశారు. అందుకోసమే మీరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదువుతున్న సంగతి తెలిసిందే. సిటీలో జనాలు ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకోసమే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒవైసీ మరీ మరీ సూచించారు, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ- ఆర్ఎస్ఎస్ నుంచి ముప్పు ఉందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.

BJP: ‘నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం’.. రేవంత్‌కు డీకే అరుణ సవాల్


దెబ్బతిన్న మనోభావాలు

ఒవైసీ వ్యాఖ్యలపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. గోవులు, మందిర్ అంశంపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒవైసీ చేసిన కామెంట్లతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వివరించారు. ఇదే అంశాన్ని ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని రాజా సింగ్ కోరారు. రాష్ట్రంలో మజ్లీస్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి కాపాడటంతో అసదుద్దీన్ ఇలా రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అసదుద్దీన్ సఖ్యంగా ఉన్నారని వివరించారు.

TS Elections: ఆగస్టులో రాజకీయ సంక్షోభం.. రేవంత్ మనసంతా అటు వైపే..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 20 , 2024 | 04:08 PM