Share News

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

ABN , Publish Date - May 23 , 2024 | 03:31 PM

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తొలిసారి స్పందించారు. ఈవీఎంను పిన్నెళ్లి ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని స్పష్టం చేశారు.

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తొలిసారి స్పందించారు. ఈవీఎంను పిన్నెళ్లి ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలుసుకుంటామని చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఈవీఎం ధ్వసం ఘటన విషయంలో అధికారులపై చర్యలు తీసుకున్నామని, సరైన సమాచారం అందివ్వనందుకుగానూ విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చామని మీనా వెల్లడించారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, వారి బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు.


ఇక మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఈ సమయంలో వెళ్లడం కాదని మీనా కుమార్ సూచించారు. ఇప్పుడే అక్కడి పరిస్థితి అదుపులోనికి వచ్చిందని, టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే వైసీపీ నేతలు కూడా పరామర్శకు వెళతామంటారని, మళ్లీ పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


వీడియో ఎన్నికల కమిషన్ నుంచి వెళ్లలేదు..

పాల్వాయి పోలింగ్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. దర్యాప్తు సమయంలో ఎక్కడ, ఎవరి చేతినుంచో బయటకు వెళ్లిందని అన్నారు. 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించేందుకు తాను స్వయంగా పర్యటనలు చేపడతానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

Pinnelli: ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు

MLA Pinnelli : పిన్నెల్లి పరార్‌!

For more Election News and Telugu News

Updated Date - May 23 , 2024 | 03:45 PM