Share News

Teen Accident: మైనర్ లగ్జరీ కారుతో యాక్సిడెంట్ చేసి.. ఇద్దరిని చంపిన కేసులో కోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - May 20 , 2024 | 07:37 PM

మహారాష్ట్రలోని పూణె(pune)లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు ఖరీదైన పోర్షే కారు(Porsche luxury car)తో మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆ క్రమంలో కోర్టు అతడిని పెద్దవారిలా విచారించి పోలీసు కస్టడీకి పంపేందుకు పోలీసులు అనుమతి కోరగా, కోర్టు అందుకు నిరాకరించి నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులు ఏంటనేది ఇప్పుడు చుద్దాం.

Teen Accident: మైనర్ లగ్జరీ కారుతో యాక్సిడెంట్ చేసి.. ఇద్దరిని చంపిన కేసులో కోర్టు కీలక తీర్పు
pune minor accident case

మహారాష్ట్ర(maharasta)లోని పూణె(pune)లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలుడు ఖరీదైన పోర్షే కారు(Porsche luxury car)తో మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ కేసులో కారు నడుపుతున్న 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టు (మైనర్‌ల కోసం ప్రత్యేక కోర్టు)లో హాజరుపరిచారు. ఆ క్రమంలో కోర్టు అతడిని పెద్దవారిలా విచారించి పోలీసు కస్టడీకి పంపేందుకు పోలీసులు అనుమతి కోరగా, కోర్టు అందుకు నిరాకరించి నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


ఈ క్రమంలో నిందితుడి తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ కొన్ని షరతులతో కోర్టు తన క్లయింట్‌కు బెయిల్(bail) మంజూరు చేసినట్లు చెప్పారు. షరతులలో మైనర్ ఎరవాడ ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పని చేయమని, దీంతోపాటు ప్రమాదంపై ఎస్సై రాయాలని కోరిందని చెప్పారు. నిందితుడికి మద్యం మానివేయడంలో సహాయపడే వైద్యుడి నుంచి చికిత్స పొందాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇది కాకుండా 'మానసిక వైద్యుడి నుంచి సంప్రదింపులు' తీసుకొని తన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.


కారు నడుపుతున్న బాలుడు, మోటార్‌సైకిల్‌(bike) నడుపుతున్న యువకుడు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి నిందితుడి తండ్రి, మైనర్ నిందితులకు మద్యం అందించిన బార్‌పై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నట్లు పుణె సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదానికి ముందు పూణే పబ్‌లో టీనేజర్లు మద్యం సేవిస్తున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇది కూడా చదవండి:

Accident: లగ్జరీ కార్ డ్రైవింగ్ చేసి మైనర్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త


Read Latest Crime News and Telugu News

Updated Date - May 20 , 2024 | 07:41 PM